Ghee Benefits: మనిషి ఆరోగ్యానికి కావల్సిన వివిద రకాల పోషకాలు ప్రకృతిలో లభించే పదార్ధాల్లోనే పుష్కలంగా ఉంటాయి. ఏవి దేనికి వాడాలి, ఎలా వాడాలో తెలుసుకుంటే సరిపోతుంది. అందులో ఒకటి నెయ్యి. ఇందులో పోషకాలు అనేకం. ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు కల్గిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా గ్లాసు నీళ్లలో నెయ్యి కలుపుకుని తాగితే మీరు ఊహించలేని లాభాలు చూడవచ్చు.
మనిషి ఆరోగ్యం అనేది మనం తినే ఆహారాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం లేవగానే ఎలాంటి ఆహారం తీసుకున్నామనేదానిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి రోజూ హెల్తీ డ్రింక్‌తో ప్రారంభిస్తే కచ్చితంగా ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుంది. అందుకే కొంతమంది గ్రీన్ టీతో లేదా కొంతమంది గోరు వెచ్చని నీళ్లతో, ఇంకొంతమంది నిమ్మకాయ నీళ్లతో ప్రారంభిస్తారు. రోజూ ఉదయం గోరు వెచ్చని నీటిలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగితే అద్భుతమైన ఊహించని ప్రయోజనాలు పొందవచ్చు.
నెయ్యి కలిపిన నీళ్లు తాగడం వల్ల చర్మం అందంగా మారుతుంది. చర్మం మాయిశ్చరైజ్ అవుతుంది. ఫలితంగా నేచురల్ గ్లో పొందవచ్చు. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఇన్‌ఫెక్షన్ నుంచి కాపాడుతాయి. నెయ్యి మిక్స్ చేసిన నీళ్లు రోజూ ఉదయం తాగడం వల్ల మలబద్ధకం సమస్య పోతుంది. గోరు వెచ్చి నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల మెటబోలిజం వేగవంతమవుతుంది.
గోరు వెచ్చని నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి ఓ దివ్యౌషధంతో సమానం. అందుకే పిల్లలు, పెద్దలు అందరికీ మంచిది. నరాలు, మెదడు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. నెయ్యి కలిపిన నీళ్లు రోజూ తాగడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాంతోపాటు ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే లోపం లేకుండా ఉంటుంది. అందుకే నెయ్యి రోజూ క్రమం తప్పకుండా నిర్ణీత మోతాదులో తీసుకోవడం వల్ల కంటి సమస్య నుంచి గుండె సమస్యల వరకూ అన్నింటికీ మంచిది.
నెయ్యిని రోజూ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గించవచ్చు. ఇందులో ఉండే కాంగ్జుగేటెడ్ లినోలెనిక్ యాసిడ్ కారణంగా పొట్ట, నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు కరుగుతుంది. అయితే ఎక్కువ తీసుకోకూడదు. రోజుకు 1-2 చెంచాలు మాత్రమే సేవించాలి.
Also read: Skin Care Remedy: అల్లోవెరా వర్సెస్ ఉసిరి రెండింట్లో కేశా సంరక్షణకు ఏది ఎప్పుడు వాడాలో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.