Garlic & Honey Mixture Benefits: వెల్లుల్లి తేనెల మిశ్రమంతో ఇన్ని లాభాలా..? తెలిస్తే వదిలిపెట్టరు గురూ!

Garlic and Honey Benefits: వెల్లుల్లిని ప్రతి రోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా పిప్పి పన్ను సమస్యలు కూడా దూరమవుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 17, 2023, 06:44 PM IST
Garlic & Honey Mixture Benefits: వెల్లుల్లి తేనెల మిశ్రమంతో ఇన్ని లాభాలా..? తెలిస్తే వదిలిపెట్టరు గురూ!

Garlic and Honey Mixture Benefits: వెల్లుల్లి సద్గుణాల గురించి ఆయుర్వేద శాస్త్రంలో క్లుప్తంగా వివరించారు. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. వీటిని ఆహారంలో వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సితో పాటు సల్ఫ్యూరిక్ యాసిడ్, ఐరన్, పిండి పదార్థాలు, కొవ్వు, ప్రోటీన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు వీటిని పచ్చిగా తినడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని ఇన్‌ఫెక్షన్‌లు కూడా సులభంగా దూరమవుతాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది వీటిని ఎండ కాలం తినకూడదని చెబుతూ ఉంటారు. వీటిని వేసవిలో తినడం వల్ల ఏం జరుగుతుంది?, వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి తినడం వల్ల కలిగే లాభాలు:

దగ్గు, జలుబు త్వరగా నయమవుతాయి:
ప్రస్తుతం చాలా మందిలో ఊపిరితిత్తుల నొప్పి, జలుబు, న్యుమోనియా, ఉబ్బసం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వెల్లుల్లిని ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజు తినడం వల్ల గుండెతోపాటు శ్వాస సంబంధిత వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు  ఖాళీ కడుపుతో ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్

రక్త ప్రసరణను మెరుగుపరుచుతుంది:

అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు రక్తంలో ఉన్న చెడు పదార్థాలను కూడా సులభంగా తగ్గిస్తుంది. ఇందులో అధిక పరిమాణంలో యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లభిస్తాయి. వీటిని ప్రతి రోజు నమిలి తినడం వల్ల రక్త ప్రవాహ వేగం పెరుగుతుంది. అంతేకాకుండా గుండెపోటు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా సులభంగా దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయి. 

పంటి నొప్పుల నుంచి ఉపశమనం:
ప్రస్తుతం చాలా మంది పిప్పి పన్ను నొప్పులతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ప్రభావిత ప్రాంతంలో వెల్లుల్లి రెబ్బ మిశ్రమాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో క్యాల్షియంతోపాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. దీంతో సులభంగా పంటి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News