Weight Gaining: సన్నగా ఉన్నారా? చలి కాలంలో శరీర బరువు పెంచే పండ్లు ఇవే..

Weight Gaining Fruits: బరువు తగ్గాలనుకునేవారు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో..బరువు తగ్గాలనుకునేవారు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి బరువు పెరగాలనుకునేవారు ప్రతి రోజు కొన్ని పండ్లను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2024, 04:34 PM IST
Weight Gaining: సన్నగా ఉన్నారా? చలి కాలంలో శరీర బరువు పెంచే పండ్లు ఇవే..

Weight Gaining Fruits: ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తక్కువ బరువు ఉన్నవారు శరీర బరువును పెంచుకోవడానికి రెట్టింపు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీర బరువును పెంచుకోవడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కొన్ని పండ్లలో శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు ఉంటాయి. అంతేకాకుండా వీటిల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని పండ్లను ప్రతి రోజు తీసుకోవడం వల్ల సులభంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే పండ్లను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీర బరువు పెరుగుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ పండ్లను తినడం వల్ల సులభంగా బరువు పెరుగుతారు:
అరటిపండు:

బరువు పెరగాలనుకునేవారు ప్రతి రోజు అరటిపండ్లను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో పాటు కార్బోహైడ్రేట్లు, కేలరీలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల కండరాల నిర్మాణం కూడా మెరుగుపడుతుంది. బరుపు పెరగాలనుకునేవారు ప్రతి రోజు అరటి పండ్లతో తయారు చేసిన స్మూతీస్ తాగడం చాలా మంచిది.

కొబ్బరి:
కొబ్బరిలో అనేక పోషక గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని ఆహరంలో తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా చాలా రకాల లాభాలు కలుగుతాయి. ఇందులో అధిక పరిమాణంలో కేలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లలు లభిస్తాయి. కాబట్టి ఉదయాన్నే పచ్చి కొబ్బరితో తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల సులభంగా బరువు పెరుగుతారు. అంతేకాకుండా దీనిని ఫ్రూట్ సలాడ్ లేదా స్మూతీగా కూడా తీసుకోవచ్చు.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

మామిడి పండ్లు:
మామిడి పండ్లు నోటికి మంచి రుచిని అందించడమే కాకుండా శరీరానికి చాలా రకాల పోషకాలను అందిస్తాయి. అయితే బరువు పెరగాలనుకునే వారు ప్రతి రోజు మామిడి పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మామిడిలో 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. కాబట్టి మామిడిని తీసుకోవడం వల్ల సులభంగా వెయిట్‌ గెయిన్‌ అవుతారు. 

అవకాడో:
అవకాడో కూడా శరీర బరువును పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీర బరువును పెంచేందుకు సహాయపడతాయి. అంతేకాకుందా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News