Fat Burning Drinks At Home: అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల సులభంగా ఊబకాయం సమస్యల బారిన పడుతున్నారు. బిజీ షెడ్యూల్స్ కారణంగా వ్యాయామాలు కూడా చేయలేకపోతున్నారు. అంతేకాకుండా ఇలాంటి క్రమంలోనే చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు కూడా తింటున్నారు. దీని కారణంగా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి వారు శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలను కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి వారు ప్రతి రోజు ఈ కింది రసాలను తాగాల్సి ఉంటుంది.
అల్లం, నిమ్మరసం:
అల్లం, నిమ్మరసం కలిపిన టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు వేగంగా బరువును తగ్గిస్తాయి. అయితే నిమ్మ రసంలో ఉండే యాంటీ ఇన్సులిన్ మూలకాలు లభిస్తాయి. కాబట్టి ఈ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల మధుమేహం నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా సులభంగా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది.
గ్రీన్ టీ:
గ్రీన్ టీలో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు లభిస్తాయి. దీని కారణంగా శరీరంలోని కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. దీంతో పాటు ఈ టీని తాగడం వల్ల పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీని తాగాల్సి ఉంటుంది. ఈ టీని తాగడం వల్ల చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి.
మెంతి నీరు:
మెంతి నీరులో కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. దీంతో పాటు కేలరీలు కూడా బర్న్ అవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ మొంతి నీరును ప్రతి రోజు తాగడం వల్ల ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. దీంతో పాటు శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ కూడా బయటికి వస్తాయి.
బ్లాక్ టీ:
ప్రతి రోజు బ్లాక్ టీని తాగడం కూడా శరీరానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బ్లాక్ టీలో పుష్కలంగా పాలీఫెనాల్స్ లభిస్తాయి. కాబట్టి ఈ టీని ప్రతి రోజు తాగడం వల్ల పొట్ట చుట్టు పేరుకుపోయిన కొలెస్ట్రాల్ సులభంగా కరుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి