Egg eating tips: ఆరోగ్యకరంగా ఉండాలంటే.. రోజూ ఒక గుడ్డు తినాలని నిపుణులు చెబుతుంటారు. అయితే చాలా మంది గుడ్డు తినడంలో కొత్త విధానాన్ని అనుసరిస్తుంటారు. అదేమిటంటే.. గుడ్డులో పచ్చ సొనాను పక్కనబెట్టి తెల్ల సొనాను మాత్రమే తింటుంటారు.
పచ్చ సొనాలో అధిక ఫ్యాట్ ఉంటుందని.. అది తింటే లావు పెరుగుతామని చెబుతుంటారు. ముఖ్యంగా లావు ఎక్కువగా ఉన్నవాళ్లు, ఫిట్నెస్గా ఉండాలనుకునే వాళ్లు ఇలా గుడ్డులో తెల్లటి పదార్థం మాత్రమే తిని.. పచ్చ సొనాను వదిలేస్తుంటారు. అయితే ఇది ఎంత వరకు నిజం? పచ్చ సొనా వదిలేసి.. మిగతా భాగాన్ని మాత్రమే తినడం మంచిదా? దాని వల్ల ఏమైన సమస్యలు ఉన్నాయా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నిపుణులు ఏమంటున్నారు?
గుడ్డులో పచ్చ సొనా తినడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందనేది కేవలం అపోహ మాత్రమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుడ్డులో మొత్తం విలువైన పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. అందుకే గుడ్డును పూర్తిగా తింటేనే.. దానిలో ఉండే పోషకాలు కూడా మొత్తం శరీరానికి అందుతాయని అంటున్నారు.
గుడ్డులో ఉండే పోషకాలు ఇవే..
సాధారణంగా గుడ్డులో విటమిన్లతో పాటు.. భారీగా పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరిచే 'ఏ' విటమిన్ మొదలుకుని.. ఈ, బీ, కే విటమిన్లు ఇందులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు.. ఆరోగ్యకరమైన కొవ్వులు మాత్రమే ఇందులో పుష్కలంగా ఉంటాయని అంటున్నారు. అందుకే పచ్చ సొనా విషయంలో ఉండే అపోహలు వీడాలను సూచిస్తున్నారు. అది శరీరానికి మేలు చేస్తుందని స్పష్టం చేస్తున్నారు.
సైడ్ ఎఫెక్ట్స్..
తరచూ.. గుడ్డులో పచ్చ సొనా వదిలేసి.. కేవలం తెల్ల సొనా తింటున్నట్లయితే పలు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా అలర్జీలు, దురత వంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు. అంతే కాకుండా.. సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా కారణంగా కొన్ని సార్లు ఫుడ్ పాయిజన్ అవుతుందని విశ్లేషిస్తున్నారు. అందుకే గడ్డు ద్వారా పూర్తి పోషకాలు లభించాలన్నా.. ఎలాంటి సమస్యలు రావొద్దన్నా.. గుడ్డుమొత్తాన్ని తినాలను వైద్యు నిపుణులు సలహా ఇస్తున్నారు.
Also read: Earwax Removal: ఇయర్ బడ్స్‌తో చెవిలో గులిమిని క్లీన్ చేయడం మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..
Also read: Best Health, Fitness Apps: ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కి పనికొచ్చే బెస్ట్ యాప్స్ ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook