Duplicate Alcohol: కల్తీమద్యం ఎలా తయారు చేస్తారు, ఎందుకు విషమవుతుంది

Duplicate Alcohol: కల్తీమద్యం ఓ పెనుసవాలుగా మారింది. విచ్చలవిడిగా ప్రవహిస్తున్న కల్తీమద్యం కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కల్తీమద్యం ఎలా తయారు చేస్తారు, ఎందుకిది విషంలా మారుతుందనేది పరిశీలిద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 7, 2021, 04:51 PM IST
Duplicate Alcohol: కల్తీమద్యం ఎలా తయారు చేస్తారు, ఎందుకు విషమవుతుంది

Duplicate Alcohol: కల్తీమద్యం ఓ పెనుసవాలుగా మారింది. విచ్చలవిడిగా ప్రవహిస్తున్న కల్తీమద్యం కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కల్తీమద్యం ఎలా తయారు చేస్తారు, ఎందుకిది విషంలా మారుతుందనేది పరిశీలిద్దాం.

దేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో కల్తీమద్యం విచ్చలవిడిగా తయారవుతోంది. ఫలితంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా బీహార్‌లో 41 మంది కల్తీమద్యం సేవించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మద్యనిషేధం ఉన్నా సరే కల్తీమద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీల్లో కూడా ఇదే పరిస్థితి. అసలీ కల్తీమద్యం(Duplicate Liquor) ఎందుకు విషమై..ప్రాణాలు తీస్తుంది, ఎలా తయారు చేస్తారనేది తెలుసుకుందాం.

కల్తీమద్యంనే దేశీ మద్యం అని కూడా పిలుస్తారు. చెరకు లేదా ఖర్జూరం, చక్కెర, సాల్ట్ పెట్రే, బార్లీ, మొక్కజొన్న, కుళ్లిన ద్రాక్ష, బంగాళదుంప, బియ్యం, చెడిన నారింజ మొదలైనవాటిని ముడి సరుకులుగా ఉపయోగిస్తారు. ఈ అన్ని పదార్ధాల్ని కలిపి ఈస్ట్ ద్వారా పులియబెడతారు. ఆ తరువాత దీనికి ఆక్సిటాసిన్, నౌసాదర్, బెస్రాంబెల్ ఆకులు, యూరియా సైతం కలుపుతారు. ఇలా చేయడం వల్ల నపుంసకత్వం కలిగే అవకాశముంది. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మట్టిలో పాతిపెట్టిన తరవాత బట్టి సహాయంతో ఆవిరి నుంచి మద్యం తయారు చేస్తారు. దీనిని మరింత మత్తుగా మార్చేందుకు మిథనాల్ కూడా కలుపుతారు. అయితే ఇలా తయారుచేసిన మద్యం మరింత మత్తుగా మార్చేందుకు నిర్వాహకులు రకరకాల రసాయనాలను కలుపుతున్నారు. ఈ క్రమంలో అది విషంగా మారుతుంది.

యూరియా, ఆక్సిటాక్సిన్, బెస్రాంబెల్ ఆకులు మొదలైన వాటిని కలిపి పులియబెట్టడం వల్ల అది ఆల్కహాల్ ఇథైల్ ఆల్కహాల్కు బదులుగా మిథైల్ ఆల్కహాల్‌గా(Methyl Alcohol) మారుతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఆల్కహాల్ విషపూరితం కావడానికి ఈ మిథైల్ ఆల్కహాలే కారణం. ప్రతి ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లి ఆల్డిహైడ్‌గా మారుతుంది. మిథైల్ ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లి ఫార్మాల్డిహైడ్ లేదా ఫార్మిక్ యాసిడ్ అనే విషంగా మారుతుంది. ఇది నేరుగా తాగేవారి మెదడుపై ప్రభావం చూపుతుంది. ఇలా తయారు చేసిన ఆల్కహాల్ మానవ శరీరానికి ప్రాణాంతకంగా మారుతుంది. మిథైల్ ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే రసాయన ప్రతిచర్య వేగవంతం అవుతుంది. దీని వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలు పనిచేయడం మానేస్తాయి. కొందరిలో ఈ ప్రక్రియ నిదానంగా ఉంటే మరికొందరిలో వేగంగా ఉంటుంది. 

Also read: Covaxin Vaccine: కోవాగ్జిన్‌ను గుర్తించిన ఆస్ట్రేలియా, డబ్ల్యూహెచ్‌వో నిర్ణయం రేపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News