Dry Cough Home Remedies In Telugu: ప్రస్తుతం అందర్నీ వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో పొడి దగ్గు ఒకటి ఈ దగ్గు చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోనూ వస్తోంది అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పొడి దగ్గు కొంతమందిలో ఉదయం పూట కాకుండా రాత్రిపూట తీవ్రతరమవుతోంది. దీనికి కారణంగా చాలామంది ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లో లభించే ఖరీదైన సిరప్లను వినియోగిస్తున్నారు అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. కొంతమంది ఆయుర్వేద నిపుణులు సలహాలు కూడా తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని వాపోతున్నారు.
పొడి దగ్గుతో బాధపడుతున్న వారు ప్రతి రోజు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా గోరువెచ్చని నీటిని ప్రతి రోజు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అంతేకాకుండా గొంతులో ఉన్న చికాకు, గొంతులో గలగల, గొంతు నొప్పి నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. దీంతోపాటు గోరువెచ్చని నీటిలో అల్లం రసాన్ని కలుపుకొని తాగడం వల్ల కూడా ఎంతో మంచి ఫలితాలు పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అల్లం లో ఉండే ఔషధ గుణాలు పొడి దగ్గును శాశ్వతంగా తగ్గించేందుకు ఎంతగానో సహాయపడతాయి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఈ అల్లం నీటిలో యాంటీమైక్రోబయాల్, యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం కూడా సులభంగా బయటికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు తీవ్ర పొడి దగ్గుతో బాధపడుతున్న వారు గోరువెచ్చని నీటిలో తేనెను కలుపుకొని కూడా తాగొచ్చు. ఇందులో ఉండే గుణాలు కూడా పొడి దగ్గును తగ్గించి శరీరంలోని కొలెస్ట్రాల్లో నియంత్రించేందుకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రాత్రిపూట ఎక్కువగా తగ్గేవారు తప్పకుండా తేనెను గోరువెచ్చని నీటితో కలుపుకొని తాగాలి.
గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకొని తాగడం వల్ల కూడా సులభంగా పొడి దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పొడి దగ్గు నుంచి ఉపశమనం కలిగించడమే.. కాకుండా అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి కలిగిస్తుంది. దీంతోపాటు లికోరైస్ రూట్ టీ కూడా పొడి దగ్గుకు ఎంతగానో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా పొడి దగ్గు ఉన్నవారు ఈ టీని తప్పకుండా ట్రై చేయండి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Dry Cough Home Remedies In Telugu: పొడి దగ్గు నుంచి శాశ్వతంగా విముక్తి కలిగించే ఇంటి చిట్కాలు..