Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం ఎంత ఉండాలి..విరామం ఎక్కువుంటే కరోనా వేరియంట్ల బారిన పడే ప్రమాదముందా..విరామం పెరిగితే యాంటీబాడీలు అభివృద్ది అవుతాయా లేదా..మరి డాక్టర్ ఫౌసీ ఏమంటున్నారు.
కరోనా వ్యాక్సిన్ డోసుల మధ్య కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో రెండుసార్లు విరామం పెంచింది. ముఖ్యంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్(Covishield vaccine) డోసుల మధ్య విరామం తొలుత 4-6 వారాల మధ్య ఉంటే..తరువాత 6-8 వారాలకు పెంచింది. తరువాత ఇటీవలి కాలంలో మరోసారి పెంచుతూ 12-16 వారాలు చేసింది. రెండు డోసుల మధ్య విరామం పెరిగితే యాంటీబాడీలు పెరుగుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే అమెరికా మెడికల్ అడ్వైజ్రర్, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌసీ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కల్గిస్తున్నాయి.
కరోనా టీకా డోసుల మధ్య విరామ సమయాన్ని పెంచడం ద్వారా కరోనా వేరియంట్ల (Corona Variant) బారిన పడే ప్రమాదముందని డాక్టర్ ఆంథోని ఫౌసీ హెచ్చరించారు.బ్రిటన్‌లో ఇదే జరిగిందని చెప్పారు. అందుకే షెడ్యూల్ ప్రకారం టీకా వేయాలని సూచించారు. అమెరికాలో కొత్తగా వెలుగు చూసిన డెల్టా వేరియంట్ (Delta Variant) బలంగా ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయాలని ఫౌసీ (Dr Antony Fauci) సూచించారు. వ్యాక్సిన్ల మోతాదుల మధ్య అనువైన విరామం సమయం.. ఫైజర్‌కు మూడు వారాలు, మోడెర్నాకు నాలుగు వారాలుగా తెలిపారు. విరామ సమయం పొడిగించడంతో పలు రకాల వేరియంట్ల బారినపడే అవకాశాలు ఎక్కువని వెల్లడించారు. భారత్‌తో పాటు పలు దేశాల్లో డెల్టా వేరియంట్ బలంగా ఉందని గుర్తు చేశారు. భవిష్యత్‌లో వచ్చే కరోనా థర్డ్, మరిన్ని వేవ్‌ల నుంచి ప్రజలను రక్షించడంలో వ్యాక్సిన్ కీలకమని వివరించారు.
Also read: Aviptadil Medicine: కరోనాకు కొత్తమందు, త్వరలో మార్కెట్లో అవిప్టడిల్ మందు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook