/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

ఎండాకాలం వచ్చిందంటే చాలు. చాలామంది మందుబాబులు ఒంటిలోని వేడిని తగ్గించుకోవడం కోసం బీరు సీసాలని ఆశ్రయిస్తుంటారు. అయితే అందుకు కూడా ఒక బలమైన కారణం ఉందండోయ్. బీరులో సాధారణంగా నీటి శాతం చాలా ఎక్కువగా ఉండి.. ఆల్కహాల్ శాతం పరిమితంగా ఉంటుంది. కాబట్టి వేసవిలో బీరును ఆశ్రయించేవారు కూడా ఎక్కువే. కొంతమంది డీహైడ్రేషన్ కూడా తగ్గే అవకాశం ఉందని అనుకుంటూ ఉంటారు.

అయితే ఈ విషయంలో చాలా అపోహలు ఉన్నాయని అంటున్నారు పలువురు వైద్యులు. ఏడీహెచ్ అనే హార్మోన్ ప్రతీ మనిషి శరీరంలో ఉంటుందని.. అది శరీరంలోని నీటి శాతాన్ని కంట్రోల్ చేస్తుందని.. కానీ ఆల్కహాల్‌తో కూడిన బీరు పానీయం సేవించడం వల్ల ఆ హార్మోన్ దెబ్బతినే అవకాశం ఉందనేది పలువురి అభిప్రాయం. 

అందుకే సాధ్యమైనంత వరకూ ఎండాకాలంలో ఆల్కహాల్ జోలికి పోవడం మంచిది కాదంటున్నారు పరిశోధకులు. వీలైనంత వరకు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి పానీయాలే మేలంటున్నారు. బీరు తాగడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభించవచ్చేమో కానీ.. మితిమీరి తాగితే దాని వల్ల కలిగే ఇబ్బందులు కూడా అనేకం. బీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తగ్గుముఖం పడుతుంది అన్న వాస్తవాస్తవాలపై కూడా అనుమానాలు ఉన్నాయి.

అయితే ఈ మధ్యకాలంలో మందుబాబుల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని పలు ప్రత్యేకమైన బీర్లను కూడా సిద్ధం చేస్తున్నాయి కంపెనీలు. ప్రత్యేకంగా తయారు చేసే వీట్ బీర్‌తో పాటు స్వీట్ మ్యాంగో ఫ్లేవర్డ్ బీర్లు కూడా మార్కెట్‌లోకి వస్తున్నాయంటున్నారు. బహుశా.. అలాంటివి ట్రై చేస్తే సరి.. అయినా సాధ్యమైనంత వరకు ఆరోగ్యం విషయంలో రిస్క్ తీసుకోకుండా ఉండడమే నయం కదా.

Section: 
English Title: 
Do you think drinking beer is good for health in summer?
News Source: 
Home Title: 

ఎండాకాలంలో బీరు తాగడం శ్రేయస్కరమా?

ఎండాకాలంలో బీరు తాగడం.. మంచిదా..కాదా?
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఎండాకాలంలో బీరు తాగడం.. మంచిదా..కాదా?