Side Effects of Spicy Foods: సాధారణంగా మన భారతీయులకు స్పైసీ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం. ఉత్తరాది కంటే కూడా మన దక్షిణ భారతదేశంలో మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటారు. ముఖ్యంగా రెండు రోజులు పప్పు అన్నం లేదా సప్పటి కూడు తిన్న వెంటనే మన నాలుక స్పైసీ ఫుడ్ తినడానికి తహతహలాడుతుంది. అయితే, అప్పుడప్పుడు ఫర్వాలేదు కానీ, మసాలా ఎక్కువగా ఉండే ఆహారం తరచూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అప్పడప్పుడు తినవచ్చు కానీ, తరచూ తినడం వల్ల మీకోసం ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. తరచూ రోడ్లపై ఉండే స్పైసీ ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక్కడ కాల్చిన నూనెతో ఆహారాన్ని తయారు చేస్తారు. కాబట్టి ఫ్యాటీ లివర్, కడుపు సంబంధిత సమస్యలు త్వరగా వస్తాయి.
ముఖ్యంగా మసాలా ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల గుండె మంట కూడా వస్తుంది. మసాలాల వినియోగం పెరిగినప్పుడు మలబద్ధకం సమస్య కూడా మనల్ని పీడిస్తుంది. ఆహారంలో మసాలాలు ఉండే ఆహారాలతో పాటు ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. చెప్పాలంటే మసాలాలను తగ్గిస్తే మరీ మంచిది. అధిక మసాలాలు ఉండే ఆహారం తీసుకుంటే ఆ ఆహారం పేగుల గుండా వెళ్తుంది. ఇది పేగులకు వాటి పనితీరుపై వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది పేగు పనితీరుకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా గ్యాస్, మలబద్ధకం, అజీర్తి చేస్తుంది.
పేగు ఆరోగ్యం..
పేగు ఆరోగ్యం బాగుంటాలంటే స్పైసీ ఫుడ్ తినకుండా ఉండాలి. మసాలాలు ఎక్కువగా వినియోగిస్తే కడుపులో పుండ్లు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో పేగు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
జీర్ణక్రియ..
అధిక మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగు పనితీరు కుంటుపడుతుంది. దీనివల్ల కడుపులో అజీర్తి చేస్తుంది. మలబద్ధకం సమస్య కూడా వస్తుంది. అంతేకాదు గుండెలో మంట కూడా వస్తుంది.
పైల్స్..
అంతేకాదు అధిక మసాలాలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల పైల్స్ వచ్చే ప్రమాదం పుష్కలంగా ఉంది. ఎందుకంటే ఇవి పేగు పనితీరును కుంటుపడేలా చేస్తాయి. దీంతో పైల్స్ సమస్య వస్తుంది. మలంలో రక్తం వస్తుంది.
ఇదీ చదవండి: ఖర్జూరం మగవారికి ఆ విషయంలో ఎంతో ప్రత్యేకం.. నెయ్యిలో నానబెట్టి ఇలా తింటే..?
మానసిక ఆరోగ్యం..
ముఖ్యంగా స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల మన మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఒత్తిడి హార్మోన్ల లెవల్స్ పెరుగుతాయి. మానసిక ఒత్తిడి లేకుండా మెదడు ఉత్తేజితంగా పనిచేయాలంటే ఆకుకూరలు, పండ్లు మన ఆహారంలో చేర్చుకోవాలి.
హైబీపీ..
స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల హైబీపీ సమస్య కూడా వస్తుంది. ఎందుకంటే ఇందులో నూనె విపరీతంగా వాడతారు. ఫలితంగా ఇవి కొలెస్ట్రాల్ కు దారితీస్తాయి. హై బ్లడ్ ప్రెజర్ కూడా వస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
ఇదీ చదవండి: వెల్లుల్లి సీక్రెట్ తెలిస్తే అస్సలు వదలరు..రోజూ ఒక్కసారి ఇలా తిని చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Spicy Foods: మసాలా ఎక్కువగా ఉండే ఆహారం తింటున్నారా? అయితే, ఈ వ్యాధులు మీకోసం ఎదురుచూస్తున్నాయి..