Healthy Digestive Drinks: ఆధునిక కాలంలో మారిన ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలతో తరుచుగా సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం చాలా మంది మార్కెట్లో లభించే మందులు, పొడులు ఉపయోగిస్తారు. కానీ దీంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ సహాజంగా ఇంట్లోనే కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలను ఉపయోగించి ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం.
ప్రతిరోజు ఉదయం ఈ ఆరోగ్యకరమైన పదార్థాలతో జ్యూస్ తయారు చేసుకొని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అందులో మొదటిది..
నిమ్మకాయ నీరు:
ప్రతిరోజు ఉదయం నిమ్మకాయ నీటిని తాగడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుతుంది. ఉదయం పరగడపున ఒక గ్లాస్లో నిమ్మకాయ నీరు కలుపుకొని తాగడం వల్ల జీర్ణసమస్యలు తగ్గుతాయి.
అల్లం టీ:
అల్లం టీలో జీర్ణవ్యవస్థతను పెంచే పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉదయం అల్లం టీ తయారు చేసుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
గోధుమ గడ్డి:
ఆయుర్వేదంలో గోధుమ గడ్డికి ఎంతో ప్రసిద్ధ స్థానం ఉంది. ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అలాగే గ్యాస్ సమస్య మాయం అవుతుంది.
కలబంద రసం:
ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ కలబంద రసం తాగుతే కడుపులో ఉండే క్రీములు తొలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జీర్ణక్రియతో పాటు అనేక ఆరోగ్య లాభాలు పొందవచ్చు.
ప్రతిరోజు వీటిలో ఏదైనా ఒక జ్యూస్ ట్రై చేయడం వల్ల జన్మలో గ్యాస్, జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అతిగా వేయించిన ఆహారపదార్థాలు, డ్రింక్స్‌లు, కొవ్వు పదార్థాలు తీసుకోవడం తగ్గించడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. యోగా, వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఫైబర్ ఎక్కువగా లభించే ఆహారం డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇబ్బందులు కలగకుండా ఉంటాయి.
గమనిక:
ఈ జ్యూస్‌లు వాడే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే దీని తీసుకొనే ముందు వైద్యుడి సలహా తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.