Weight Loss Diet Plan: ఊబకాయం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం, ట్రిపుల్ నాళాల వ్యాధి, కరోనరీ ఆర్టరీ వ్యాధి వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. ఇది శరీరంలో కేలరీల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి శరీరంలో కేలరీల పరిమాణాలను బట్టి శరీర బరువు ఆధారపడి ఉంటుంది. అందుకే రోజువారీ తీసుకునే క్యాలరీలపై జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కాబట్టి రోజు వారి ఆహారంలో పలు రకాల ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు సగటున ఎన్ని కేలరీలు తీసుకోవాలి?
బరువు తగ్గాలనుకునేవారు కేలరీల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారాలు కూడా మీ వయస్సు, లింగం, ఎత్తు, ప్రస్తుత బరువుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి బరువు తగ్గే క్రమంలో తప్పకుండా తక్కువ కేలరీలు కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కేలరీలను తగ్గించుకోవడానికి ప్రతి రోజు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరం చురుకుగా తయారై.. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
ప్రస్తుతం చాలా మంది శరీర బరువును తగ్గించుకోవడానికి పోషకాలు, కేలరీలు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకుంటున్నారు. కాబట్టి శరీర బరువు, వయసుకు అనుగుణంగా ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులను సంప్రదించి మీ బరువుకు తగ్గ ఆహారాలు తీసుకోవడం చాలా మేలు. ప్రతి రోజు బరువు తగ్గాలనుకునేవారు 1,000 నుంచి 1,200 కేలరీలను పరిమితం చేయాల్సి ఉంటుంది.
మహిళలు రోజు ఈ క్రింద పేర్కొన్నకేలరీలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది:
19 నుంచి 30 సంవత్సరాలు ప్రతి రోజు 2,000 నుంచి 2,400 కేలరీలు తీసుకోవాల్సి ఉంటుంది.
31నుంచి 59 సంవత్సరాలు ప్రతి రోజు 1,800 నుంచి 2,200 కేలరీలు తీసుకోవాలి.
60 సంవత్సరాల వారు 1,600 నుంచి 2,000 కేలరీలు తీసుకోవాలి.
Also read: Karnataka Exit Polls 2023: ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ వెనుకంజ, జీ న్యూస్, రిపబ్లిక్ టీవీ సహా అన్నీ కాంగ్రెస్ పార్టీకే పట్టం
పురుషుల కేలరీల చార్ట్
19 నుంచి 30 సంవత్సరాలు వారు 2,400–3,000 కేలరీలు తీసుకోవాలి.
31నుంచి 59 సంవత్సరాలు వారు 2,200–3,000 కేలరీలు తీసుకోవాలి.
60+ సంవత్సరాలు వారు 2,000–2,600 కేలరీలు తీసుకోవాల్సి ఉంటుంది.
పిల్లల కేలరీల చార్ట్:
2-4 సంవత్సరాలు వారు- పిల్లలు: 1,000 నుంచి 1,600 కేలరీలు
ఆడపిల్లలు: 1,000 నుంచి 1,400 కేలరీలు
5-8 సంవత్సరాలు వారు- పిల్లలు: 1,200 నుంచి 2,000 కేలరీలు
బాలికలు: 1,200 నుంచి 1,800 కేలరీలు
9-13 సంవత్సరాలు వారు - పిల్లలు: 1,600 నుంచి 2,600 కేలరీలు
ఆడపిల్లలు: 1,400 నుంచి 2,200 కేలరీలు
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook