Diabetes Homemade Treatment: ప్రస్తుతం చాలా మంది షుగర్ పెషేంట్స్ జీవితాంతం మందులపై ఆధారపడవలసి వస్తోందని ఇటీవలే నివేదికలు తెలిపాయి. వీరు ఎన్ని ఔషధాలు వినియోగించిన.. ఆశించిన ఫలితాలను పొందలేక పోతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే సమస్య నుంచి విముక్తి పొందడానికి పలు రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటిని వాడడం వల్ల డయాబెటిక్ రోగులలో షుగర్‌ని నియంత్రించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే షుగర్ పెషేంట్స్ ఎలాంటి టిప్స్‌ను అనుసరించాలో తెలుసుకుందాం..
1. శనగ పిండి రోటీ:
శెనగపిండి రోటీలో చాలా రకాల పోషకాలుంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెరను కూడా నియంత్రిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఉదయం పూట ఈ పిండితో చేసిన రొట్టెలను తినడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.
2. ఖాళీ కడుపుతో తులసి రసాన్ని తాగండి:
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి రసం తాగడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే తులసి రసాన్ని క్రమం తప్పకుండా తాగితే.. బ్లడ్‌లో షుగర్ అదుపులోకి వస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
3. నేరేడు పండు:
వేసవి, వానా కాలంలో నేరేడు పండు తింటే శరీరానికి మంచి పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెరను కూడా నియంత్రణలో ఉంచుతుంది. అయితే దీనికి నల్ల ఉప్పు కలిపి తింటే రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(NOTE : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Read also: Weight loss By Walnuts: బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వీటిని తినండి..!
Read also: Weight loss By Walnuts: బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వీటిని తినండి..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Diabetes Homemade Treatment: షుగర్ పెషేంట్స్ క్రమం తప్పకుండా వీటిని తినండి.. త్వరలోనే ఉపశమనం పొందుతారు..!
క్రమం తప్పకుండా శనగ పిండి రోటీ తినండి..
త్వరలోనే ఉపశమనం పొందుతారు
ఖాళీ కడుపుతో తులసి రసాన్ని కూడా తాగండి