Anjeer For Diabetes Control: మధుమేహం నియంత్రించుకునే క్రమంలో తప్పకుండా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇలా పాటించడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో మధుమేహం కారణంగా రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగి వివిధ రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే సమస్యలకు చెక్ పెట్టడానికి పలు పోషకాలున్న డ్రై ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా ఉండడమే కాకుండా అన్ని అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే డ్రై ఫ్రూట్స్‌లో వేటిని తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందో తెలుసుకుందాం..
వీటిని తీసుకుంటే చాలు మధుమేహానికి చెక్ పెట్టొచ్చు:
అంజీర పండు:
మధుమేహంతో బాధపడుతున్నవారికి అంజీర పండు చాలా మేలు చేస్తుంది. ఈ పండులో శరీరానికి కావాల్సిన ఫైబర్, కాల్షియం, ఐరన్, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్:
అంజీర పండులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి ప్రయోజనాలు కలగడమేకాకుండా చెడు కొలెస్ట్రాల్ సమస్యలు దూరమవుతాయి.
మధుమేహంతో బాధపడుతున్నవారు ఇలా పండ్లను తీసుకోవాలి:
మధుమేహంతో బాధపడుతున్నవారు ఈ పండ్లను 4 నుంచి 5 గంటలు పాలలో నానబెట్టి.. రాత్రి నిద్రపోయే ముందు తినాలి. అయినప్పటికీ మీరు దానిని పరిమిత పరిమాణంలో తినవాల్సి ఉంటుంది.
అంజీర్ ఆకులు:
అంజీర్ ఆకుల్లో కూడా చాలా రకాల మూలకాలు ఉంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు అంజీర్ ఆకులను టీలో మరిగించి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.
ఈ పండుతో వీటిని కూడా తినొచ్చు:
అంజీర్ పండ్లతో పాటు.. డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు యాపిల్స్, ఆప్రికాట్లు, బ్లూబెర్రీస్, కాంటాలప్, చెర్రీస్, కివీస్, నారింజ, బొప్పాయి, స్ట్రాబెర్రీలు మొదలైన పండ్లను కూడా తినవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఈ పండు యొక్క ప్రయోజనాలు:
<<మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
<<గుండెకు చాలా రకాలుగా మేలు చేస్తుంది.
<<ఎముకలను దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook