Dates Benefits: ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో శరీరానికి హాని చేకూర్చే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రోజుకు కేవలం మూడే మూడు ఖర్జూరం పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోవడం ఖాయం. అవేంటో తెలుసుకుందాం.
ఖర్జూరం అనేది పొటాషియం, మెగ్నీషియం, విటమిమిన్ బి6, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే వేదిక. ఫ్రీ రాడికల్స్ నుంచి మన శరీరాన్ని రక్షించడంలో ఖర్జూరం అద్భుతంగా పనిచేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తొలగుతుంది. రోజూ ఖర్జూరం తీసుకునేవారిలో బౌల్ సిస్టమ్ క్రమబద్ధీకరణ అవుతుంది.
శరీరానికి సహజసిద్ధమైన ఎనర్జీ అందాలంటే ఖర్జూరం పండ్లకు మించింది మరొకటి లేదు. ఇందులో కార్బోహైడ్రేట్స్, సహజసిద్ధమైన షుగర్ కంటెంట్ ఎక్కవగా ఉండటం వల్ల శరీరాన్ని తక్షణ శక్తి అందుతుంది. అందుకే వ్యాయామానికి ముందు ఖర్జూరం తీసుకుంటే చాలా మంచిదంటారు.
గుండె ఆరోగ్యానికి ఖర్జూరం పండ్లు చాలా చాలా మంచివి. కార్డియో వాస్క్యులర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఖర్జూరం అనేది కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలను ఖర్జూరం అందిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం ఇందుకు దోహదం చేస్తుంది. బ్రెయిన్ హెల్త్ మెరుగుపర్చడమే కాకుండా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అదే సమయంలో గుండె పోటు ముప్పు కూడా తగ్గుతుంది.
వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనమౌతుంటాయి. అందుకే కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉండే ఖర్జూరం పండ్లు తీసుకుంటే ఎముకలు పటిష్టంగా ఉంటాయి. బోన్ లాస్, ఆస్టియోపోరోసిస్ ముప్పు నుంచి తగ్గించేందుకు ఖర్జూరం పండ్లు ఉపయోగపడతాయి.
అన్నింటికంటే ముఖ్యంగా ఖర్జూరం బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అద్భుతంగా నియంత్రిస్తుంది. మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఖర్జూరం పండ్లు బ్యాలెన్సింగ్ డైట్‌లా పనిచేస్తాయి. ఇవి సహజసిద్ధంగా తీపిగా ఉన్నా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో శరీరంలో నెమ్మదిగా సంగ్రహణ అవుతాయి. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒకేసారి పెరగవు. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఖర్జూరం మంచి ప్రత్యామ్నాయం.
Also read: Purple Foods: ఈ 5 రకాల పర్పుల్ ఫుడ్స్ తీసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook