Curd Rice Benefits In Telugu: పెరుగు అన్నం తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను ఆరోగ్యం చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని కాల్షియాన్ని పెంచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే మలబద్ధకం, పొట్ట సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు కూడా దోహదపడుతుంది. ఇందులో ఉండే కొన్ని మూలకాలు గుండెను ఆరోగ్యంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.
ఎముకలు బలపడతాయి:
పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా పెరుగు అన్నం తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. అంతేకాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
పెరుగులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు రోగ నిరోధక శక్తిని పెంచి, అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిచేందుకు కూడా సహాయపడుతుంది.
చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది:
పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఇది ముఖ్యంగా మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో పాటు తీవ్ర చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది:
పెరుగులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా శరీర బరువును తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.