Curd Health Benefits: పెరుగులో వీటిని కలుపుకొని తినడం వల్ల సగం రోగాలు దూరమవుతాయి!

Curd Health Benefits: మనం రోజు తినే ఆహారంలో చాలా మంది తప్పుకుండా పెరుగుకు చోటిస్తారు. కానీ, మరికొందరు పెరుగు అంటే ఎలర్జీ అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. కానీ, పెరుగుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2022, 04:09 PM IST
Curd Health Benefits: పెరుగులో వీటిని కలుపుకొని తినడం వల్ల సగం రోగాలు దూరమవుతాయి!

Curd Health Benefits: ప్రతిరోజూ పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే పెరుగును అనేక ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే అనేక రోగాలు నయమవుతాయని మీకు తెలుసా? పెరుగులో క్యాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండడంతో పాటు లాక్టోస్, ఐరన్, ఫాస్పరస్ వంటి మూలకాలు ఉన్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే పెరుగు తినడం వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. పెరుగు, జీలకర్ర

పెరుగు, జీలకర్ర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అధిక బరువుతో ఇబ్బంది పడే వారు పెరుగుతో జీలకర్ర కలిపి తింటే మీరు కచ్చితంగా బరువు తగ్గుతారు. జీలకర్రను వేడి చేసి.. ఆ తర్వాత దాన్ని పొడిగా మార్చి పెరుగుతో కలిపి తినొచ్చు. 

2. పెరుగు, చక్కెర 

పెరుగును చక్కెరతో కలిపి తినడం వల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటికి కలిపి తినడం వల్ల గొంతులోని కఫం సమస్య కూడా తొలగిపోతుంది. దీంతో పాటు మీ శరీరానికి తక్షణ శక్తి కూడా లభిస్తోంది. 

3. పెరుగు, రాక్ సాల్ట్

సాధారణంగా ఉపవాస సమయంలో చాలా మంది రాక్ సాల్ట్ తో కలిపిన పెరుగును తింటుంటారు. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. 

4. పెరుగు, వాము

పెరుగు, వాము కలిపి తినడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీన్ని తినడం వల్ల దంతాలు, చిగుళ్ల నొప్పి పోతుంది. దీంతో పాటు అల్సర్ సమస్య కూడా దూరమవుతుంది. 

5. పెరుగు, నల్ల మిరియాలు 

పెరుగులో నల్ల మిరియాలు కలిపి తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని కలిపి తినడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. మూడు చెంచాల పెరుగులో రెండు చెంచాల నల్ల మిరియాల పొడిని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లే చేసి.. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. అలా చేయడం వల్ల జుట్టు సిల్కీగా మారడం సహా జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. 

(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)           

Also Read: Black Pepper for Weight Loss: నల్ల మిరియాల వినియోగంతో మీరు తక్షణం బరువు తగొచ్చు!

Also Read: Jaggery Tea for Diabetes: షుగర్ పేషెంట్లు బెల్లం టీ తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News