Coronavirus on children: కరోనా ప్రభావం చిన్నారులపై ఏ మేరకు, యూకే అధ్యయనం ఏం చెబుతోంది

Coronavirus on children: కరోనా మహమ్మారి ప్రభావం చిన్నారులపై ఎలా ఉండబోతుందనే విషయంపై స్పష్టత వస్తోంది. చిన్నారులపై కరోనా వైరస్ ప్రభావం ఏ మేరకుంటుందనే విషయంలో యూకే అధ్యయనం కీలక విషయాల్ని వెల్లడించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 10, 2021, 05:22 PM IST
 Coronavirus on children: కరోనా ప్రభావం చిన్నారులపై ఏ మేరకు, యూకే అధ్యయనం ఏం చెబుతోంది

Coronavirus on children: కరోనా మహమ్మారి ప్రభావం చిన్నారులపై ఎలా ఉండబోతుందనే విషయంపై స్పష్టత వస్తోంది. చిన్నారులపై కరోనా వైరస్ ప్రభావం ఏ మేరకుంటుందనే విషయంలో యూకే అధ్యయనం కీలక విషయాల్ని వెల్లడించింది.

కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave)ముప్పు వెంటాడుతోంది. థర్డ్‌వేవ్ ప్రభావం చిన్నారులపై అధికంగా ఉంటుందంటూ వస్తున్న వార్తలతో మరింత ఆందోళన కలుగుతోంది. ఈ నేపధ్యంలో యూకే అధ్యయనం వెల్లడించిన విషయాలు ఆసక్తి రేపడమే కాకుండా ఊరట కల్గిస్తున్నాయి. కరోనా వైరస్‌కు కారణమయ్యే సార్స్ కోవ్-2 ప్రభావం చిన్నారులు, టీనేజ్ యువతలో చాలా తక్కువని యూకేలో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. యూకేలోని యూనివర్శిటీ కాలేజ్ లండన్, యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్శిటీ ఆఫ్ యార్క్, యూనివర్శిటీ ఆఫ్ లివర్‌పూల్ ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహించారు. 18 ఏళ్లలోపువారిపై జరిగిన ఈ సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

ప్రతి 4 లక్షల 81 వేలమందిలో ఒక్కరు మాత్రమే కరోనాకు గురయ్యే అవకాశముందని గుర్తించారు. అంటే ప్రతి పదిలక్షలమందికి ఇద్దరు చిన్నారులు మాత్రమే కోవిడ్ (Covid19) బారిన పడవచ్చు. ఆరోగ్యవంతులైన పిల్లలు, యువతపై కోవిడ్ 19 అంతగా ప్రభావం చూపించలేదని..భయపడాల్సిన అవసరం లేదని అధ్యయనకర్తలు తెలిపారు. వైరస్ కారణంగా పిల్లల్లో తీవ్ర అనారోగ్యం, మరణాలు పెద్దగా లేవని స్పష్టం చేశారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు మాత్రమే కరోనా పంజాకు బలవుతున్నట్టు అధ్యయనంలో తేలింది. 

Also read: Vaccination For Children: 12 నుంచి 18 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సినేషన్‌పై శుభవార్త, Zydus Vaccine రెడీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News