Immunity Kadha: అద్భుతమైన ఇమ్యూనిటీ కోసం..గిలోయ్ కాడా 5 నిమిషాల్లో సిద్ధం

Immunity Kadha: ఆయుర్వేదంలో గిలోయ్ కాడాకు అద్భుతమైన మహత్యముంది. ఈ కాడాతో రోజు ప్రారంభిస్తే ఇమ్యూనిటీ శరవేగంగా పెరుగుతుంది. కరోనా మహమ్మారి మరోసారి ప్రమాదకరంగా మారిన నేపధ్యంలో గిలోయ్ కాడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 26, 2022, 11:52 PM IST
Immunity Kadha: అద్భుతమైన ఇమ్యూనిటీ కోసం..గిలోయ్ కాడా 5 నిమిషాల్లో సిద్ధం

గిలోయ్ ఒక ఆయుర్వేద మూలిక. ప్రాచీన కాలం నుంచి ఈ మూలిక వాడకంలో ఉంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. చలికాలంలో కరోనా మహమ్మారి మరోసారి వ్యాపిస్తున్న క్రమంలో గిలోయ్ కాడా చాలా ఉపయోగకరం. 

కరోనా మహమ్మారి మరోసారి విస్తరించే ముప్పు పొంచి ఉంది. కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ఇమ్యూనిటీ మరింత బలోపేతం కావాలి. గిలోయ్ కాడా తాగడం వల్ల ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది. కాడాతో రోజు ప్రారంభిస్తే చాలా మంచిది. ఈ కాడా తయారీ కూడా చాలా సులభం. 

గిలోయ్ కాడా తయారీకు 7-8 కాడా ఆకులు, మూలికలు కావాలి. 4-5 తులసి ఆకులుండాలి. 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 ఇంచ్ అల్లం, 8-10 నల్ల మిరియాలు, 1 టీ స్పూన్ వాము అవసరమౌతాయి. గిలోయ్ కాడా తయారీ కోసం ముందుగా గిలోయ్ ఆకులు, మూలికల్ని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత అల్లం నల్ల మిరియాలను పౌడర్‌గా చేసి..ఒక ప్యాన్‌లో 2 కప్పుల నీళ్లు ఉడికించి వేడి చేయాలి. ఇందులో గిలోయ్ ఆకులు, మూలికలు వేసి కాస్సేపు ఉడికించాలి. చివరిగా ఇందులో తులసి ఆకులు, వాము, అల్లం పేస్ట్, నల్ల మిరియాలు దాల్చిన చెక్క వేయాలి.  అన్నింటినీ మరోసారి ఉడికించి చల్లారిన తరువాత రోజూ ఉదయం తీసుకోవాలి. 

Also read: Cholesterol Tips: రాత్రి వేళ పొరపాటున కూడా తినకూడని పదార్ధాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News