Constipation Pain: ప్రస్తుతం చాలా మంది ఉదయం పూట మల విసర్జన చేయడంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీని కారణంగా రోజంతా సరిగ్గా తినాలని, తాగాలని అనిపించకపోవచ్చు. ఈ సమస్యనే మలబద్ధకం అని అంటారు. ఇది కూడా ఒకరకమైన పొట్ట సమస్యే..ఇలాంటి సమస్యతో బాధపడేవారిలో మలం విసర్జించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా మానసిక సమస్యలే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంతమంచిది. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, ఫైబర్ లేని ఆహారాలు తినడం, నీటీని తాగకపోడమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కొన్ని ఆహార పదార్థాలను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది.
వీటిని తప్పకుండా తీసుకోండి:
పాప్ కార్న్:
ప్రస్తుతం చాలా మంది టైం పాస్ కోసం పాప్ కార్న్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే మలబద్ధకం ఉన్నవారు ప్రతి రోజు పాప్ కార్న్ తీసుకోవడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు సాయంత్రం పూట పాప్ కార్న్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
ఓట్స్:
ఓట్స్ తినడం ప్రతి రోజు తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దీని కారణంగా ఆహారం బాగా జీర్ణమై అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ప్రతి రోజు ఓట్స్‌ని సాయంత్రం స్నాక్‌లో తీసుకోవాలి.
చిలగడదుంప:
కందగడ్డను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ దుంపు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు ఆహారం ప్రేగులను శుభ్రం చేసేందేకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
పియర్:
మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించేందుకు పియర్ కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఫైబర్ ఉండే గుణాలు అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు కూడా సహాయపడతాయి.
పెరుగు:
పెరుగులో ప్రోబయోటిక్స్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు పెరుగును ఆహారంలో చేర్చుకుంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీంతో పాటు ఇందులో ఉండే లభించే గుణాలు మలాన్ని మృదువుగా చేయడానికి సహాయపడతుంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి