Constipation Effective Remedy: మలబద్దకం కూడా ఆరోగ్య సమస్య. దీంతో మరిన్ని ఆరోగ్య వస్తాయి. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరైన జీవనశైలి అనుసరించకపోవడం, ఎక్సర్సైజులు వంటివి చేయకపోవడం దీనికి ప్రధాన కారణం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని ఆహారాలు మన డైట్లో చేర్చుకుంటే దీనికి చక్కని రెమిడి లభిస్తుంది
తృణధాన్యాలు..
ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం తృణధాన్యాలు ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది మీ ప్రతిరోజు డైలీ డైటులో చేర్చుకోవడం వల్ల మలబద్ధక సమస్యకు చెక్ పెట్టొచ్చు, ధాన్యాలు మీ డైట్ లో చేర్చుకోవాలి ఇలాంటి పప్పులతో ఫుడ్ తయారు చేసుకుంటే మంచిది అంతే కాదు వీటితో ఉడకపెట్టి స్నాక్స్ మాదిరి కూడా తయారు చేసుకోవచ్చు ఇందులో ప్రోటీన్ అధిక శాతం ఉంటుంది.
ఓట్స్..
ఓట్స్, పోహాలో కూడా ఫైబర్ అధిక మోతాదులో ఉండటం వల్ల దీర్ఘకాలిక మలబద్దక సమస్యకు చెక్ పెడుతుంది. అంతేకాదు ఇది బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే కూడా హెవీగా అనిపించదు. ఆరోగ్యకరమైన పేగు కదలికకు తోడ్పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం గింజలు, విత్తనాలు కూడా మీ డైట్ లో చేర్చుకుంటే ఫైబర్స్ అధికంగా ఉండే సమస్యకు చెక్ పెడతాయి, ఫ్లాక్ సీడ్స్ గుమ్మడి గింజలు, చియా గింజలు, వాల్నట్స్, పిస్తా ,బాదం వంటివి చేర్చుకోవాలి.వీటితో ఆరోగ్యకరమైన డ్రింక్ కూడా తయారు చేసుకోవచ్చు.
పుదీనా, జిలకర్ర యాడ్ చేసుకుని బటర్ మిల్క్ తయారు చేసుకున్న మలబద్ధక సమస్యకు ఎఫెక్ట్ గా పని చేస్తుంది.
కూరగాయలు..
కూరగాయలు బీన్స్, గోరుచిక్కుడు వంటివి డైట్ లో చేర్చుకోవాలి ఇందులో అధిక మోతాదులో ఫైబర్ ఉంటుంది. పిల్లలకు కూడా ఆరోగ్యకరమైన కూరగాయలతో సూప్ కూడా తయారు చేసుకుని పిల్లలకు పెట్టొచ్చు 2018 నివేదిక ప్రకారం ఆరు శాతం మంది ఇండియన్స్ మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారు ఇది సరైన జీవనశైలి అనుసరించకపోవడమే ప్రధాన కారణం.
ఇదీ చదవండి: పేగు ఆరోగ్యానికి 5 పండ్లు గ్యాస్ అజీర్తి జాడే ఉండదు..
ఉడకబెట్టిన ఆలుగడ్డ..
ఆలుగడ్డ అనారోగ్యకరమైన కూరగాయ అనుకుంటారు. కానీ ఏదైనా అతిగా తినకుండా ఉంటే అది ఆరోగ్యకరమే
ఆలుగడ్డ కూరగాయ, ఉడకపెట్టి చల్లారిన తర్వాత తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్యకు చెక్ పెడుతుంది. ఇది పిల్లలకు పెద్దలకు ఇద్దరికీ ఆరోగ్యకరమే అయితే ఏదైనా డీప్ ఫ్రై చేసిన ఆహారాలు తీసుకోకూడదు. ఉడకబెట్టి చల్లార్చిన తర్వాత అందులో స్టార్చ్ ఏర్పడుతుంది ఈ ఆలుగడ్డ రిసిపీ తీసుకోవడం వల్ల మంచిది. అంతేకాదు పచ్చి అరటి పండ్లు, ఓట్స్, బీన్స్ వంటివి కూడా డైట్ లో చేర్చుకోవాలి.
ప్రోబయోటిక్స్..
నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాలు చేర్చుకోవాలి. మీరు పెరుగు వంటివి తీసుకోకపోతే వాటిని ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం అలవాటు చేసుకోవడం, పాల పదార్థాలు డైట్లో చేర్చుకోవడం వల్ల మలబద్దక సమస్యకు చెక్ పెట్టొచ్చు.
ఇదీ చదవండి: బీరకాయతో బరువు తగ్గుతారు.. మీ శరీరంలో 5 మ్యాజికల్ మిరాకిల్స్..
పండ్లు..
ఫైబర్ అధికమవుతాదిలో ఉండే ఆహారాలు పండ్లు కూడా జామకాయ ఆపిల్స్ అప్లికేట్స్ స్ట్రాబెర్రీస్ కానీ మా పియర్స్ వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన పేగు కదలికి తోడ్పడతాయి. మీ పిల్లలు కూడా స్మూథీస్ రూపంలో ఇవ్వచ్చు .(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Constipation: దీర్ఘకాలిక మలబద్దక సమస్యకు ఇది సింపుల్ చిట్కా.. మీరూ తెలుసుకోండి..