High Blood Pressure Home Remedies: అధిక రక్తపోటు అనేది సైలెంట్ కిల్లర్ తో సమానం.. ఎందుకంటే ప్రస్తుతం చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడానికి ఇదే ప్రధాన కారణం. ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది అధిక రక్తపోటు సమస్యల బారిన పడుతున్నారు. చాలామందిలో శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, ఒత్తిడి కారణంగా ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారు. కొంతమంది యువతలో ఇలాంటి సమస్య చాలా సులభంగా వస్తుంది. అయినప్పటికీ దీనిని గుర్తించలేకపోతున్నారు. తద్వారా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.
సాధారణ రక్తపోటు 120/80 కంటే రీడింగ్ 140/90 ఉంటే ప్రీ-హైపర్‌టెన్సివ్‌గా పరిగణిస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కంటే ఎక్కువగా ఉంటే హై బిపి గా భావించవచ్చు అయితే ఆధునిక జీవనశైలి కారణంగా యువతలో కూడా హై బీపీ సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యను గుర్తించి సకాలంలో చికిత్స పొందితే చాలా మంచిది లేకపోతే గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ప్రీ బీపీ సమస్యలతో బాధపడేవారు వైద్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
ఇవి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
1. కొబ్బరి నీరు:
కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ఎన్నో రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఈ నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఈ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల పొటాషియం, ఎలక్ట్రోలైట్ లోపం నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రక్తపోటు సమస్యలతో బాధపడే వారికి ఈ నీరు ప్రభావంతంగా సహాయపడుతుంది.
2. పెరుగు:
ఆహారంలో ప్రతిరోజు పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం తో పాటు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు పెరుగును ఆహారంలో తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడుతుంది.
3.వెల్లుల్లి:
వెల్లుల్లి రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను సులభంగా కరిగిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు కూడా వెల్లుల్లిని ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు రక్త ప్రసరణ మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.
4. వీట్ గ్రాస్ జ్యూస్:
శరీర బరువును తగ్గించేందుకు వీట్ గ్రాస్ జ్యూస్ ఎంత ప్రభావంతంగా సహాయపడుతుందో బీపీని నియంత్రించేందుకు కూడా అంతే సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో మెగ్నీషియం పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఈ రసాన్ని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతోపాటు శరీరంలోని రోగ నిరోధక శక్తి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక బీపీ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాసు చొప్పున గోధుమ గడ్డి రసాన్ని తాగాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి