చిన్న వయసులో స్మార్ట్ ఫోన్ లు చూసే పిల్లలు పెద్ద అయ్యాక ఆత్మహత్యకి పాల్పడే అవకాశాలు ఎక్కువట!

పిల్లలకి ఫోన్ ఇవ్వటం వలన భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు వస్తాయని అమెరికాకి చెందిన ఒక ప్రముఖ సంస్థ వెల్లడించింది. పిల్లలు మొబైల్స్ వాడటం వలన మానసిక రుగ్మతలకు లోనవుతారని నిపుణులు తెలిపారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2023, 05:57 PM IST
చిన్న వయసులో స్మార్ట్ ఫోన్ లు చూసే పిల్లలు పెద్ద అయ్యాక ఆత్మహత్యకి పాల్పడే అవకాశాలు ఎక్కువట!

పిల్లలకు స్మార్ట్ ఫోన్ లు ఇవ్వద్దని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు స్మార్ట్‌ ఫోన్ లు ఇస్తూ స్వయంగా తమ పిల్లలను తమ చేతులతో నాశనం చేస్తున్నారు అంటూ తాజాగా ఒక ప్రముఖ సంస్థ చేపట్టిన అధ్యాయనంలో వెళ్లడి అయ్యింది. అమెరికాకు చెందిన స్వచ్చంద సంస్థ సేపియన్ ల్యాబ్స్ 40 దేశాల్లో సర్వే నిర్వహించింది. భారత్ తో పాటు పలు అభివృద్ది చెందిన దేశాల్లో మరియు అభివృద్ది చెందని దేశాల్లో కూడా ఈ సర్వే జరిగింది. 

అన్ని దేశాల తల్లిదండ్రులు కూడా తమ చిన్నారులకు స్మార్ట్‌ ఫోన్ లు చేతికి అందిస్తున్నారు. మంచిది కాదు అని తెలిసి కూడా వారిని ఏదో ఒక సమయంలో ఓదార్చడం కోసం ఫోన్‌ లు ఇస్తున్నారు. అదే వారికి వ్యసనంగా మారుతుంది. దాంతో స్మార్ట్‌ ఫోన్ ల వల్ల చిన్నారులు ఆత్మహత్యలకు కూడా పాల్పడే ప్రమాదం ఉందని ప్రముఖ అధ్యాయన సంస్థ పేర్కొంది.

చిన్న వయసు లో స్మార్ట్‌ ఫోన్‌ లు చూసిన వారు పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆలోచన శక్తి పెరగక పోవడంతో పాటు ప్రతి చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని అధ్యాయనంలో వెళ్లడి అయ్యింది. పెద్ద అయ్యాక కూడా ఇతరులతో కలవక పోవడంతో పాటు ప్రతి చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచించడం వల్ల ఒత్తడి పెరిగి మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

సేపియన్‌ ల్యాబ్స్ నిర్వహించిన సర్వేలో 18 నుండి 24 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 27,969 మంది పాల్గొన్నారు. ఆ మొత్తం మందిలో నాలుగు వేల మంది ఇండియన్స్ కూడా ఉన్నారు. ఆడవారు మగవారు అనే తేడా లేకుండా స్మార్ట్‌ ఫోన్‌ ఎక్కువగా వాడుతున్న వారిలో మానసిక సమస్యలు పెరగడంతో పాటు ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా పెరుగుతున్నట్లుగా సర్వే ఫలితంలో వెళ్లడి అయ్యింది. 

Also Read: Virat Kohli Bowling: పాడ్స్ కట్టుకుని మరీ బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. గ్లెన్ మాక్స్‌వెల్ కామెంటరీ అదుర్స్! వైరల్ వీడియో  

స్మార్ట్‌ ఫోన్‌ లు వాడుతూ మానసిక సమస్యలతో బాధ పడుతున్న వారి సంఖ్య అంతర్జాతీయ సగటుతో పోల్చితే ఇండియా సగటు ఎక్కువగా ఉండటం ఆందోళనకు గురి చేసే విషయం. 10 నుండి 14 ఏళ్ల వయసు ఉన్న భారతీయ పిల్లల్లో 76 శాతం మంది స్మార్ట్‌ ఫోన్ కి బానిస అయినట్లుగా సర్వేలో వెళ్లడి అయ్యింది. వారు ఏకంగా 5 నుండి 8 గంటల పాటు స్మార్ట్ ఫోన్‌ ను చూస్తున్నారట. 

సంవత్సరానికి దాదాపుగా మూడు వేల గంటల పాటు ఆన్ లైన్ లోనే ఆ పిల్లలు గడుపుతున్నారు. ఇది అంతర్జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ. భారత్‌ లో ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఒకప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ లు లేనప్పుడు పిల్లలు ఎక్కువగా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో సమయాన్ని గడిపేవారు. దాంతో పిల్లలో ఆలోచన శక్తి ఎక్కువ అయ్యేది. 

కానీ ఇప్పుడు ఎక్కువగా స్మార్ట్‌ ఫోన్ వాడటం వల్ల పరిస్థితి చేతులు దాటుతుంది. పిల్లలకు స్మార్ట్ ఫోన్ లు దూరం ఉంచడం తల్లిదండ్రుల బాధ్యత. వారిని సాధ్యం అయినంత తక్కువ సమయం స్మార్ట్ ఫోన్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Revanth Reddy: అలా అయితే కేసీఆర్ కుటుంబం బిచ్చమెత్తుకుని బతకాల్సి వచ్చేది: రేవంత్ రెడ్డి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News