Health Benefits of Cardamom: యాలకులు సుగంధ ద్రవ్యాలను కలిగి ఉంటాయి. ఇవి ఆహారానికి రుచినివ్వడమే కాకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతాయి. అయితే వీటిని ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ఈ యాలకులను రాత్రిపూట గోరువెచ్చని నీరుతో కలిపి తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయట పడుతారు. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది.
యాలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా యాలకులు వల్ల అధిక రక్తపోటు, శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారికి యాలకులు ఎంతో మేలు చేస్తాయి. కిడ్నీలలో ఉండే మలినాలను తొలగించడంలో ఎంతో సహాయపడుతాయి. అంతేకాకుండా చర్మంపై వచ్చే నల్ల మచ్చలను తగ్గించడంలో యాలకులు దోహదపడుతాయి.
జుట్టు చిట్లడం, ఊడిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు యాలకులు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. నోటి దుర్వాసనను వస్తే ఫ్రెష్ నర్‌గా వీటిని ఉపయోగించవచ్చు.అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడే వారు యాలకులను తినడడం వల్ల మేలు కలుగుతుంది. ముఖ్యంగా జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. లివర్ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు యాలకులు చాలా సహాయపడుతుంది.
నరాల బలహీనత ఉన్నవారు, లైంగిక సామర్థ్యం లేనివారు ప్రతిరోజు యాలకులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: Healthy Foods: మీ పిల్లలకు పరగడుపున ఈ 5 పదార్ధాలు ఇస్తే అన్ని సమస్యలకు చెక్
యాలకుల టీ తాగితే మంచి ఫలితాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కఫం, ఊపిరాడకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ యాలకులతో ఉపశమనం పొందవచ్చు.
బ్లడ్ ప్రెజర్ ను ఎక్కువ, తక్కువ కాకుండా యాలకులు సహాయపడుతాయి.
క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంచడంలో యాలకులు ఉపయోగపడుతాయి.
యాలుకలు తీసుకోవడం వల్ల కడుపులో మంట, నొప్పి వంటివి తగ్గి పోతాయని నిపుణులు చెబుతున్నారు.
యాలకులు ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీంతో గుండెకు సంబంధించిన సమస్యలు రావని నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Winter Diet: చలికాలంలో ఈ పదార్ధాలకు దూరంగా ఉండకపోతే మూల్యం చెల్లించుకోవల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter