Egg Pudding Recipe: కోడిగుడ్డుతో అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. అయితే అందులో ఒక స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చు అంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. అవును మీరు వింటున్నది నిజమే. కోడి గుడ్డుతో స్వీట్లు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ చాలా రుచికరంగాను ఆరోగ్యకరమైనదిగాను ఉంటుంది. ఈ స్వీట్ తింటే మీకు పాలు కోడిగుడ్లలోని పోషకాలు మీకు పుష్కలంగా లభిస్తాయి. కోడి గుడ్డుతో చేసే పుడ్డింగ్ వంటకం చాలా రుచికరంగా ఉంటుంది. అచ్చం చూడడానికి జున్నులా ఉండే ఈ పుడ్డింగ్ విదేశాల్లో చాలా డిమాండ్ ఉన్న వంటకం. ముఖ్యంగా టర్కీ లోను, ఈ వంటకాన్ని చాలామంది ఇష్టపడతారు. ఎగ్ ఫుడ్డింగ్ తయారు చేయడం కూడా చాలా సులభమైన పద్ధతి. . దీని తయారు చేయడం ద్వారా మీ కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. అలాంటి ఎగ్ పుడ్డింగ్ తయారీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఫుడ్డింగ్ అనేది భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. కారామెల్ పుడ్డింగ్ అనేది రుచికరమైన డెజర్ట్ వంటకం. దీని తయారీ విధానం తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
>> 250 ml పాలు
>> 3-4 స్పూన్ చక్కెర
>> 3 గుడ్లు
>> 1/2 టీస్పూన్ వెనిలా ఎసెన్స్
>> 1/2 టీస్పూన్ ఏలకుల పొడి
తయారీ విధానం:
ముందుగా పంచదార పాకం తయారు చేసుకోవాలి. ఇందుకోసం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పంచదార నీటిలో వేసి తక్కువ మంట మీద కదిలిస్తూ ఉండాలి. ఇలా చేస్తే పంచదార మొత్తం కరుగుతుంది. రంగు మారే వరకు ఇలాగే ఉంచాలి. ఇప్పుడు మరో గిన్నెలో 3 గుడ్లు పగలగొట్టి బాగా గిలక్కొట్టి ఆ మిశ్రమంలో, పావు లీటర్ పాలు పోసి మిక్స్ చేయాలి. అలాగే పావు టీస్పూన్ యాలకుల పొడి వేసి కలపాలి. పావు టీస్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మరో గిన్నెలో పోయాలి. అలాగే ఇందులో ముందుగా కరిగించుకున్న చక్కెర పాకం కూడా వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమం ఉన్న గిన్నెను ఒక కుక్కర్ లో నీరు పోసి హెడ్ లేకుండా మూత పెట్టి స్టౌ వెలిగించి ఆవిరిపై ఉడికించాలి. 20-25 నిమిషాలు తర్వాత, టూత్ పిక్ గుచ్చి ఒకసారి పుడ్డింగ్ అయ్యిందా లేదా తనిఖీ చేయండి. టూత్ పిక్ శుభ్రంగా బయటకు వస్తే, పుడ్డింగ్ సిద్ధం అయిందని అర్థం. ఇప్పుడు పుడ్డింగ్ చల్లబడిన తర్వాత సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది రుచికరంగా జున్ను టేస్టులా ఉంటుది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.