Weight Loss Tips: ప్రతిరోజు గ్లాసు ఈ రసాన్ని తాగితే..శరీర బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలకు 15 రోజుల్లో చెక్ పెట్టొచ్చు!

Bottle Gourd For Weight Loss: శరీరంలోని కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా చాలామంది ఊబకాయం సమస్య బారిన పడుతున్నారు. దీంతోపాటు చాలామందిలో బెల్లీ ఫ్యాట్ సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి.. శరీర బరువు తగ్గడానికి ప్రతి రోజు సొరకాయ రసాన్ని తాగాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2023, 08:26 PM IST
 Weight Loss Tips: ప్రతిరోజు గ్లాసు ఈ రసాన్ని తాగితే..శరీర బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలకు 15 రోజుల్లో చెక్ పెట్టొచ్చు!

 

Bottle Gourd For Weight Loss: ప్రస్తుతం చాలామంది యువత ఆధునిక జీవనశైలిన అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగానే స్ట్రీట్ ఫుడ్ ఆల్కహాల్ కి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం మానుకొని రోడ్ల మీద లభించే అనారోగ్యకరమైన ఆహారాలను విచ్చలవిడిగా తింటున్నారు. దీనికి కారణంగా ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ సమస్యల బారిన పడుతున్నారు.  అధిక బరువు ఆరోగ్యానికి ఎంతో హానికరం దీని కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలా బరువు పెరుగుతున్న వారు తప్పకుండా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

పెరిగిన బరువును తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా చాలామంది ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవడం, వ్యాయామాలు చేయడం, వాకింగ్, జాగింగ్ లు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే కొంతమంది మంచి ఫలితాలు పొందినప్పటికీ.. కొన్ని రోజుల్లోనే మళ్లీ బరువు పెరుగుతున్నారు. అయితే శరీర బరువుకి శాశ్వతంగా తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా శరీర శ్రమతో పాటు ఆరోగ్య నిపుణులు సూచించిన ఒక చిట్కాను పాటించాల్సి ఉంటుంది. దీనిని పాటించడం వల్ల సులభంగా మీరు మంచి ఫలితాలు పొందుతారు.

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

శరీర బరువును తగ్గించుకోవడానికి సొరకాయ రసం ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని కొలెస్ట్రాలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఒక గ్లాసు సొరకాయ రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఇందులో అధిక పరిమాణంలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలను కూడా సులభంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల వారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. అయితే ఈ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో? బరువు తగ్గడానికి ఎలా తాగాలో? మనం ఇప్పుడు తెలుసుకుందాం..

శరీర బరువును తగ్గించే సొరకాయ రసాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా.. కొన్ని సొరకాయ ముక్కలను తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలోనే ఒక గ్లాస్ వాటర్ ని పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకొని గ్లాస్ లో సర్వ్ చేసుకుని తాగొచ్చు. ఇలా ప్రతిరోజు ఒక గ్లాసు చొప్పున తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గడమే కాకుండా వేడి శరీరం నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News