Boost Blood Production: ప్రస్తుతం చాలా మంది శరీరంలో రక్త కోరత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే శరీరంలో ఈ సమస్యల ఏర్పడితే చాలా రకాల అనారోగ్య సమస్యలకే దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి రక్త కోరత సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆహారాలును కూడా తీసుకోమన్ని సలహా ఇస్తున్నారు. అయితే ఆ ఆహారాలేంటో వాటిని తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రక్త కోరత సమస్యలున్న వీటిని తినండి:
బీట్‌రూట్:
బీట్‌రూట్ శరీరంలో రక్తాన్ని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని సులభంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా బీట్‌రూట్ శరీరంలో రక్తాన్ని పెంచి ఐరన్‌ను కూడా పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. కాబట్టి వీటిని తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి.
దానిమ్మ రసం:
ఐరన్ లోపాన్నితొలగించడానికి దానిమ్మ రసం ప్రభావవంతంగా సహాయపడుతుంది. కాబట్టి వీటితో చేసిన జ్యూస్‌ను ప్రతి రోజూ తాగడం వల్ల రక్తహీనత సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా పేగు మంటను తగ్గిస్తుంది. కాబట్టి గుండె పోటు సమస్యలతో బాధపడేవారు ఈ రసాన్ని ప్రతి రోజూ తాగితే మంచి ఫలితాలు పొందుతారు.
బచ్చలికూర:
బచ్చలికూరలో శరీరానికి కావాల్సిన ఐరన్, విటమిన్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల స్టోర్హౌస్ పుష్కలంగా లభిస్తాయి. ఇది శరీరంలో రక్తాన్ని పెంచడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అయితే ఎముకల సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ బచ్చలికూరను తింటే మంచి ప్రయోజనాలు పొందుతారు.
డ్రై ఫ్రూట్స్:
శరీరంలో రక్తాన్ని పెంచడానికి డ్రై ఫ్రూట్స్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు బాదం, వాల్‌నట్, జీడిపప్పు, ఆప్రికాట్‌ను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు రక్తంలో ఎర్ర రక్త కణాలను కూడా పెంచుతుంది.
తృణధాన్యాలు:
శరీరంలో రక్త కోరతను తగ్గించడానికి తప్పకుండా పప్పులు, తృణధాన్యాలు, ప్రోటీన్, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు చాలా రకాలుగా సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది.
Also Read: Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్
Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి