Blood Group Foods: సాధారణంగా ప్రతి మనిషి రక్తంలోని రక్త కణాల ఉపరితలంపై ఉన్న ప్రోటీన్ల ఆధారంగా విభిన్న బ్లడ్ గ్రూప్ కు చెంది ఉంటారు. వీటిని యాంటిజెన్లు అంటారు. ఇవి నాలుగు రకాల రక్తవర్గాలుగా ఉంటాయి.
అందులో ...
A బ్లడ్ గ్రూప్: ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారి రక్తంలో A యాంటిజెన్లు ఉంటాయి.
B బ్లడ్ గ్రూప్: ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారి రక్తంలో B యాంటిజెన్లు ఉంటాయి.
AB బ్లడ్ గ్రూప్: ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారి రక్తంలో A, B రెండు రకాల యాంటిజెన్లు ఉంటాయి.
O బ్లడ్ గ్రూప్: ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారి రక్తంలో ఏ రకమైన యాంటిజెన్లు ఉండవు.
అయితే ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఆహార విషయంలో కొన్ని పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని, రక్తం ఉంటుంది. శరీరానికి కావాల్సిన రక్తం లేకపోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. ఏ ఏ బ్లడ్ గ్రూప్‌లు ఉన్నారు ఎలాంటి ఆహారపదార్థాలను తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
ప్రతి బ్లడ్ గ్రూప్‌కు ప్రత్యేకమైన ఆహారం ఉంటుంది, దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
వివిధ బ్లడ్ గ్రూప్‌లకు సూచించే ఆహారాలు:
A బ్లడ్ గ్రూప్: ఎ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఎక్కువగా పండ్లు, కూరగాయాలు తీసుకోవడం చాలా మంచిది. గింజలు, గోధుమలు వంటి ఆహారాలు వీరికి మంచివి.
B బ్లడ్ గ్రూప్: B బ్లడ్ గ్రూప్ ఉన్నవారు పౌల్ట్రీ, చేపలు, పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు. వీటితో పాటు పండ్లు, కూరగాయలు కూడా తీసుకోవాలి.
AB బ్లడ్ గ్రూప్: ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారు చేపలు, రొయ్యలు, సీ ఫుడ్ వంటివి తీసుకోవడం మంచిది. ఇవి ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను అందిస్తాయి.
O బ్లడ్ గ్రూప్: ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారు మాంసం, చేపలు, కూరగాయలను తీసుకోవడం మంచిది. చికెన్, గొర్రె, ఆకుకూరలు, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్, బెర్రీలు, పైనాపిల్ వంటివి తినడం మంచిది.
అయితే ఆహారంతో పాటు శరీరానికి వాయ్యమం చేయాల్సి ఉంటుంది. రోజుకు 5-6 సార్లు చిన్న చిన్న భోజనాలు చేయడం మంచిది. తీపి పదార్థాలు, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం నివారించాలి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. నడక, జాగింగ్ వంటి సరళమైన వ్యాయామాలు చేయవచ్చు.
Read more: Buttermilk Hidden Facts: రోజు మజ్జిగ తాగితే కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.