Black Water Benefits: ప్రస్తుతం యువత అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని అనేక రకాల ఆరోగ్యకరమైన అలవాటులను అనుసరిస్తున్నారు. మరికొందరైతే శరీరాన్ని ఫిట్ గా తయారు చేసుకోవడానికి జిమ్ లో గంటల తరబడి వర్కౌట్స్ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి లీటర్ల కొద్దీ నీటిని కూడా తాగుతున్నారు. ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీస్ మార్కెట్లో లభించే రకరకాల బ్రాండ్లకు సంబంధించిన నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా బ్లాక్ వాటర్ కనిపిస్తూ ఉంటున్నాయి. ఇంతకీ ఈ బ్లాక్ వాటర్ ని ఎలా తయారు చేస్తారో.. ఆ నీటిని తాగడం వల్ల ఆ నీటిని తాగడం వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాక్ వాటర్ అంటే ఏమిటి?:
ఈ బ్లాక్ వాటర్ లో అనేక పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఫుల్విక్ మినరల్స్ వంటి చాలా ముఖ్యమైన ఖనిజాలు కూడా లభిస్తాయి. కాబట్టి ఈ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
డీహైడ్రేషన్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి:
శరీరం డిహైడ్రేషన్ కు గురి కావడం వల్ల అనేక రకాల అవయవాలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రక్త ప్రక్రియలో కూడా చాలా రకాల మార్పులు వస్తాయి. అయితే బ్లాక్ వాటర్ ని తాగడం వల్ల ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు.
శరీరంలోని మంచి బాక్టీరియాను పెంచుతుంది:
బ్లాక్ వాటర్ ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి బ్లాక్ వాటర్ ని ప్రతిరోజు తాగడం వల్ల పొట్టలోని చెడు బ్యాక్టీరియా తొలగిపోయి. మంచి బ్యాక్టీరియా పెరుగుతుందని దీనికి కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ప్రేగులను ఆరోగ్యంగా చేసేందుకు కూడా సహాయపడతాయి.
శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది:
ఈ బ్లాక్ వాటర్ తాగడం వల్ల శరీరం నిర్వీకరణ అవుతుంది. అంతేకాకుండా పిత్తాశయ పనితీరు కూడా మెరుగుపడుతుందని మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
వృద్ధాప్యాన్ని నివారిస్తుంది:
బ్లాక్ వాటర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని నిరోధించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా శరీరానికి అనేక రకాల పోషకాలు అందిస్తాయి. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించేందుకు కూడా సహాయపడతాయి. కాబట్టి దీని కారణంగా శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
మధుమేహం ఉన్నవారు..
మధుమేహం ఉన్న వారికి కూడా ఈ బ్లాక్ వాటర్ ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈ బ్లాక్ వాటర్ లో ఉండే గుణాలు రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించేందుకు ప్రభావవంతంగా సహాయపడతాయి. అంతేకాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.