Black Pepper for Weight Loss: నల్ల మిరియాల వినియోగంతో మీరు తక్షణం బరువు తగొచ్చు!

Black Pepper for Weight Loss: ఆహార నియంత్రణ లోపం లేదా ఆహారపు అలవాట్లు మారడం వల్ల మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అలాంటి సమస్యతో బాధపడే వారు రోజూ తినే ఆహారంలో నల్ల మిరియాలను వినియోగిస్తే.. వెంటనే బరువు తగొచ్చు. అదెలాగో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2022, 05:29 PM IST
Black Pepper for Weight Loss: నల్ల మిరియాల వినియోగంతో మీరు తక్షణం బరువు తగొచ్చు!

Black Pepper for Weight Loss: మీరు త్వరగా బరువు తగ్గాలని చూస్తున్నారా? అయితే మీకు నల్ల మిరియాలు ఉత్తమ ఎంపిక. నల్ల మిరియాలు బరువు తగ్గడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే నల్ల మిరియాలను ఏ విధంగా వినియోగించాలో తెలుసుకుందాం. 

జీవక్రియ మెరుగవుతుంది!

నల్ల మిరియాలు బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నల్ల మిరియాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్ కలిగి ఉన్నాయి. నల్ల మిరియాలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటితో జీవక్రియ మెరుగవుతుంది. 

బరువు తగ్గేందుకు నల్ల మిరియాలు..

1. నల్ల మిరియాలతో తయారు చేసిన టీ ని తాగొచ్చు. దీన్ని తాగడం వల్ల అధిక బరువును నియంత్రించుకోవచ్చు. 

2. నల్ల మిరియాల టీలో అల్లం, తేనె, తులసి, దాల్చిన చెక్క, నిమ్మ, గ్రీన్ టీ కూడా కలిపి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బరువును కోల్పోవచ్చు. 

నల్ల మిరియాలు ఎప్పుడు తీసుకోవాలి?

- అల్పాహారానికి ముందు బ్లాక్ పెప్పర్ టీ తాగొచ్చు. దీని వల్ల మీ శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. 

- అంతేకాకుండా మీరు నల్ల మిరియాలను నేరుగా తినాలనుకునే వారు.. ఉదయాన్ని తాగే డిటాక్స్ డ్రింక్ లో కలిపి తాగొచ్చు. 

- నల్ల మిరియాల పొడిని పండ్ల రసంలో కూడా కలిపి తాగొచ్చు. దీని వల్ల శరీర బరువును నియంత్రించుకోవచ్చు. 

(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)           

Also Read: Jaggery Tea for Diabetes: షుగర్ పేషెంట్లు బెల్లం టీ తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Also Read: Honey Facial Benefits: తేనె వినియోగంతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News