Omega 3 Fatty Acids: ఒమేగా 3 యాసిడ్స్ పుష్కలంగా లభించే శాకాహార పదార్ధాలేంటో తెలుసా

Omega 3 Fatty Acids: మనిషి శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన పోషక పదార్ధాల్లో ఇది ముఖ్యమైంది. చేపల్లో ఎక్కువగా లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏయే శాకాహార పదార్ధాల్లో ఉంటుందో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 1, 2022, 03:01 PM IST
Omega 3 Fatty Acids: ఒమేగా 3 యాసిడ్స్ పుష్కలంగా లభించే శాకాహార పదార్ధాలేంటో తెలుసా

Omega 3 Fatty Acids: మనిషి శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన పోషక పదార్ధాల్లో ఇది ముఖ్యమైంది. చేపల్లో ఎక్కువగా లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏయే శాకాహార పదార్ధాల్లో ఉంటుందో తెలుసుకుందాం..

చర్మ సంబంధిత సమస్యలు, గుండె సమస్యలు, కీళ్ల నొప్పుల నివారణలో కీలకంగా ఉపయోగపడేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె వ్యాధుల నియంత్రణకు బాగా ఉపయోగపడుతుందని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి సహజంగా నాన్‌వెజ్ ఆహారంలో పుష్కలంగా లభిస్తుంది. మరీ ముఖ్యంగా చేపల్లో కావల్సినంత పరిమాణంలో దొరుకుతుంది.

అందుకే వెజిటేరియన్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం స్పష్టంగా కన్పిస్తుంది. అందుకే కొన్ని రకాల వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకుంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపాన్ని సరిచేసుకోవచ్చంటున్నారు వైద్యులు. 

పెద్దవారికైతే రోజుకు 1.5 నుంచి 2 గ్రాముల వరకూ ఒమేకా 3 అవసరమౌతుంది. అంటే రోజుకు 5 వాల్‌నట్స్ తీసుకుంటే.. 6 వందల మిల్లీగ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అందుతుంది. అలాగే మూడు టీ స్పూన్స్ పరిమాణంలో చియా సీడ్స్ లేదా ఫ్లెక్స్ సీడ్స్ , గుమ్మడి గింజలు తీసుకుంటే రోజుకు కావల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌లో 90 శాతం అందినట్టే. ఇక మరో ముఖ్యమైంది ఆవనూనె. ఒక టేబుల్ స్పూన్ ఆవనూనెలో 1.29 గ్రాములుంటుంది. పాలు, పెరుగులో కుూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తుంది. అన్నింటికంటే ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభించేది బ్రస్సెల్స్ మొలకల్లో. నూనెల్లో అయితే సోయాబీన్ నూనె. ఇందులో గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వు లభిస్తుంది. నాన్‌వెజ్ ముట్టనివాళ్లు..వీటిని తమ డైట్‌లో భాగంగా చేసుకుంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొరతను అధిగమించవచ్చు.

Also read: Snoring Problem: గురక రాకుండా ఉండాలంటే... ఈ ఇంటి చిట్కాలు పాటించండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News