Protein Foods: ప్రోటీన్లంటే గుడ్డు ఒక్కటే కాదు, ఈ పదార్ధాలు కూడా ట్రై చేయవచ్చు

Protein Foods: సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే అన్ని రకాల పోషకాలు అవసరం. వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ లభించే ఆహార పదార్ధాలను డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఏ పోషకాలు లోపించినా శరీరంలో ఏదో ఒక అనారోగ్య సమస్య తలెత్తుతుంటుంది. అందుకే హెల్తీ డైట్ అనేది చాలా ముఖ్యం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 18, 2023, 01:15 PM IST
Protein Foods: ప్రోటీన్లంటే గుడ్డు ఒక్కటే కాదు, ఈ పదార్ధాలు కూడా ట్రై చేయవచ్చు

Protein Foods: మనిషి శరీరానికి ప్రోటీన్ ఫుడ్ చాలా కీలకం. శరీర నిర్మాణం, ఎముకల పటిష్టత , సంపూర్ణ ఆరోగ్యంలో ప్రోటీన్లు కీలక భూమిక వహిస్తాయి. ప్రోటీన్ పుడ్ అనగానే చాలామంది గుడ్లు తినాలని అనుకుంటారు. కానీ గుడ్లు కాకుండా ప్రకృతిలో ప్రోటీన్లు అందించే ఆహార పదార్ధాలు ఇంకా చాలానే ఉన్నాయి.

శరీరాన్ని ఆరోగ్యవంతంగా, ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంచడంలో పోషక పదార్ధాలు చాలా అవసరం. శరీరాన్ని పటిష్టంగా మార్చేవి అవే. అందుకే మనం తినే ఆహారంలో సరైన పోషకాలు ఉన్నాయో లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. వైద్యులు చెప్పిందాని ప్రకారం గుడ్లను బెస్ట్ ప్రోటీన్ ఫుడ్‌గా భావిస్తారు. ఎందుకంటే గుడ్డులో మనిషి శరీరానికి కావల్సిన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే రోజూ కనీసం ఒక గుడ్డు తినమని సూచిస్తుంటారు. 

గుడ్డు ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు ఆకలిని నియంత్రిస్తాయి. ఫలితంగా బరువు తగ్గించే ప్రక్రియలో గుడ్లు కీలకంగా ఉపయోగపడతాయి. అయితే శాకాహారులైతే మాత్రం ఇబ్బంది ఎదురౌతుంది. అందుకే అన్ని రకాల పోషక పదార్ధాల కోసం గుడ్డుకు ప్రత్యామ్నాయంగా కొన్ని పదార్ధాలు ఎంచుకోవల్సి ఉంటుంది. ఈ పదార్ధాల్లో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్లు లభిస్తాయి. డైట్‌లో ఈ పదార్ధాలు ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఏ రకమైన సమస్యలు తలెత్తవు. 

మష్రూం. శాకాహార పదార్ధాల్లో అత్యధికంగా ప్రోటీన్లు లభించేది మష్రూంలోనే. వీటిని ఉడకబెట్టి లేదా కూర రూపంలో తినవచ్చు. మష్రూం తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు తగినంతగా లభిస్తాయి. అయితే వర్షాకాలంలో వీటిని దూరంగా ఉంచడం మంచిది. ఎందుకంటే ఇన్‌ఫెక్షన్ త్వరగా సోకే ప్రమాదముంది.

ప్రోటీన్లు సమృద్ధిగా లభించే మరో పదార్ధం అవకాడో. గుడ్డుకు సరైన ప్రత్యామ్నాయం ఇదే. ఇది కూడా మొక్క ఆధారిత ప్రోటీన్ ఫుడ్ కావడంతో శాకాహారులు నిరభ్యంతరంగా తినవచ్చు. అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్లు కావల్సినంత ఉంటాయి. దాంతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమంటారు ఆరోగ్య నిపుణులు. 

ఇక బెస్ట్ వెజిటబుల్ ప్రోటీన్ ఫుడ్‌గా బీన్స్ మరో ప్రత్యామ్నాయం. బీన్స్, శెనగలు వంటి వివిధ రకాల పప్పు ధాన్యాల్ని తీసుకుంటే ప్రోటీన్లు సమృద్ధిగా అందుతాయి. ప్రత్యేకించి కంది, చిక్కుడు, గోరు చిక్కుడు, బొబ్బర్లలో మరింత ఎక్కువగా ఉంటాయి. పెసరను నానబెట్టి సలాడ్ లేదా స్ప్రౌట్స్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. లేదా పప్పులతో సూప్ చేసుకుని కూడా తాగవచ్చు.

పెరుగు కూడా మరో అద్భుతమైన ప్రత్యామ్నాయం. ప్రోటీన్ లోపముంటే డైట్‌లో పెరుగు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఇందులో ప్రోటీన్లు చాలా ఎక్కువ. 

Also read: Health tips: ఈ 5 చిట్కాలు పాటిస్తే కొలెస్ట్రాల్ సమూలంగా దూరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News