Weight Loss Remedies: రోజుకు రెండు సార్లు అనాస పూవు టీ తాగితే నెలరోజుల్లో వెయిట్ లాస్

Weight Loss Remedies: ప్రకృతిలో లభించే వివిధ రకాల వస్తువుల్లో ఆరోగ్యానికి కావల్సిన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి ప్రతి కిచెన్‌లో లభ్యమయ్యే మసాలా దినుసులు. బరువు తగ్గే క్రమంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 22, 2024, 08:01 PM IST
Weight Loss Remedies: రోజుకు రెండు సార్లు అనాస పూవు టీ తాగితే నెలరోజుల్లో వెయిట్ లాస్

Weight Loss Remedies: కిచెన్‌లో లభ్యమయ్యే మసాలా దినుసుల్లో ఆరోగ్యాన్ని అందించే పోషకాలు చాలా ఉంటాయి. వీటిలో స్టార్ అనాస పూవు కీలకమైంది. ఆరోగ్యపరంగా అద్భుతమైంది. ఉదయం రాత్రి రెండూ పూటలా ఈ పూవుతో చేసిన టీ తాగితే బరువు ఇట్టే తగ్గవచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

ప్రతి భారతీయ కిచెన్‌లో దాదాపుగా ఉండే మసాలా దినుసు స్టార్ అనాసా పూవు లేదా అనాస పూవు. ఇందులో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా చర్మ సంరక్షణ, ఇమ్యూనిటీకై అద్భుతంగా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇతర మసాలా వస్తువుల్లానే స్టార్ అనాస పూవుని వంటల్లో రుచి, సువాసన కోసం ఉపయోగిస్తుంటారు. స్టార్ అనాస పూవు సాగు ప్రపంచంలో అత్యధికంగా వియత్నాం, చైనాలో జరుగుతుంది. ఇందులో చాలా పోషకాలతో పాటు ఔషధ గుణాలుంటాయి. రోజూ క్రమం తప్పకుండా వాడితే స్థూలకాయం సహా పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. స్టార్ అనాస పూవులో ఎనీథాల్ అనే రసాయన పదార్ధం కారణంగా జీర్ణక్రియకు దోహదపడే ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల స్వెల్లింగ్, గ్యాస్ కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి. 

ఎందుకంటే ఇందులో పోలీఫెనోల్స్, టర్పెనాయిడ్స్ కారణంగా మెటబోలిజం వేగవంతమౌతుంది. ఫలితంగా బరువు తగ్గించే ప్రక్రియలో దోహదమౌతుంది. ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది. తద్వారా చలికాలంలో ఎదురయ్యే సీజనల్ ఇన్‌ఫెక్షన్లు దూరం చేయవచ్చు. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా స్టార్ అనాస పూవు నీళ్లు తాగడం వల్ల చర్మ సంరక్షణ చేయవచ్చు. చర్మంపై నిగారింపు వస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా పింపుల్స్, డ్రైనెస్ , నిర్జీవమైన చర్మం వంటి సమస్యలు దూరమౌతాయి. 
ఫ్రీ రాడికల్స్ నియంత్రించవచ్చు. 

స్టార్ అనాస పూవుతో టీ చేసేందుకు 1-2 కప్పు నీళ్లలో కొన్ని పూలు వేసి ఉడకబెట్టాలి. ఆ తరువాత వడపోయాలి. ఇందులో కొద్దిగా తేనె, నిమ్మరసం లేదా దాల్చిన చెక్క కొద్దిగా వేస్తే రుచి మరింత పెరుగుతుంది. 

Also read: Post Office Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, భారీ జీతంతో పోస్టాఫీసులో ఉన్నత ఉద్యోగాలు ఎలా అప్లై చేయాలంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News