Benefits Of Pumpkin Seeds: ఈ వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పకుండా గుమ్మడికాయ గింజలను తినండి..!!

Benefits Of Pumpkin Seeds: గుమ్మడికాయ శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో చాలా రకాల పోషకలుంటాయి. కావున దీనిని ఆహారంగా తీసుకుంటే శరీరాన్ని దృఢంగా చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Last Updated : May 24, 2022, 04:57 PM IST
  • గుమ్మడికాయ గింజలతో శరీరాని చాలా ప్రయోజనాలు
  • డయాబెటిస్‌ వ్యాధి గ్రస్తులు తప్పకుండా గుమ్మడికాయ గింజల తినండి
  • మగవారిలో శక్తిని పెంపొందించడానికి కృషి చేస్తాయి
 Benefits Of Pumpkin Seeds: ఈ వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పకుండా  గుమ్మడికాయ గింజలను తినండి..!!

Benefits Of Pumpkin Seeds: గుమ్మడికాయ శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో చాలా రకాల పోషకలుంటాయి. కావున దీనిని ఆహారంగా తీసుకుంటే శరీరాన్ని దృఢంగా చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా వీటి గింజలను ఆహారంలో ఉపయోగిస్తే శరీరానికి మంచి లాభాలు చేకూరుతాయని, గుండెను ఆరోగ్యంగా కూడా ఉంచుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయ విత్తనాన్ని పెపిటస్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఒమేగా 6, ప్రొటీన్‌లతో పాటు ఐరన్, బీటా-కెరాటిన్, కాల్షియం మొదలైన పోషకాలుంటాయి. కావున పురుషులు వివిధ సమస్యలతో బాధపడుతుంటే గుమ్మడికాయ గింజలును వాడాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ గింజలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడికాయ గింజల వలన పురుషులకు ప్రయోజనాలు:

శక్తి స్థాయిని పెంచుతాయి:

నిత్యం పురుషులు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. దీని కారణంగా ఎనర్జీ కోల్పోతారు. అటువంటి పరిస్థితిలో గుమ్మడి గింజలు దివ్యౌషధంలా పనిచేస్తాయి. మగవారిలో శక్తిని పెంపొందించడానికి ఇవి చాలా కృషి చేస్తాయి. అందుకే పురుషులు ఖచ్చితంగా గుమ్మడికాయ గింజలను తినండి.

డయాబెటిస్‌ వ్యాధి గ్రస్తులకు మేలు చేస్తుంది:

డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి గుమ్మడికాయ గింజలు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చుతాయి. ఈ గింజలలో ఉన్న గుణాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.

క్యాన్సర్ నివారణ:

మారుతున్న జీవనశైలి కారణంగా పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ గణనీయంగా పెరిగాయి. ఈ కారణంతో బాధపడుతున్న వారు గుమ్మడికాయ గింజలను తినమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
 ఇందులో ఉండే ఫైబర్, సెలీనియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ క్యాన్సర్ నివారణకు సహాయపడతాయి.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:

గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఘననీయంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులను నివారించేందుకు కృషి చేస్తాయి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Curd Benefits: ఇంటీ నుంచి బయటకు వెళ్లే సమయంలో చక్కెర కలిపిన పెరుగును తినండి..!!

Also Read: Tips And Tricks: మీ ఇంట్లో తప్పుపట్టిన పాత్రలు ఉన్నాయా..ఇలా సులభంగా వదిలించండి..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News