Men Health Tips: పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరిగేందుకు ఇవి తినాలి!

Men Health Tips: లైంగిక సమస్యలతో బాధపడే వారికి గుడ్ న్యూస్! ప్రతిరోజూ పాలతో కలిపి ఎండు ఖర్జూరాను తీసుకోవడం వల్ల లైంగిక జీవితంలో సహాయపడుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో బలహీనతలు, బద్ధకానికి స్వస్తి పలకవచ్చని తెలిపారు. ఇంతకీ ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 01:41 PM IST
Men Health Tips: పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరిగేందుకు ఇవి తినాలి!

Men Health Tips: ఏ చిన్న పని చేసినా మీరు అలసిపోతున్నారా? కొద్ది పని చేయడానికి మీరు సోమరితనంతో బాధపడుతున్నారా? అయితే మీరు వెంటనే మీ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాల్సిందే. ఎందుకంటే అవే మీ బలహీనతకు కారణం అవుతాయి. శరీరంలో శక్తి తగ్గినప్పుడే ఏ పని చేయాలన్నా.. అలసట, బద్ధకం వంటివి వస్తాయి.

మీకు అలాంటి సమస్యలు ఉంటే కొన్ని ఆహారపు అలవాట్లు చేసుకోవాల్సిందే. శరీరానికి పుష్టినిచ్చే ఆహారంతో పాటు పాలు తాగితే మంచిది. పాలు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియంతో సహా మొదలగు పోషకాలు అందుతాయి. పాలతో పాటు ఖర్జూరా లేదా ఎండు ఖర్జూరాను తీసుకుంటే శరీరంలోని బలహీనత దూరం అవుతుంది.  

పాలు, ఎండు ఖర్జూరాలు.. పురుషల శారీరక బలహీనతలను నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శారీరక బలహీనత కారణంగా.. లైంగిక శక్తి తగ్గడం ప్రారంభమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పాలు, ఎండు ఖర్జూర, వేరు శనగ వంటి వాటిని తినడం వల్ల పురుషులకు మేలు జరుగుతుంది. 

పాలు, ఖర్జూరాలో లభించే పోషకాలు

శరీరానికి కావాల్సిన కాల్షియం, ఫైబర్, జింక్, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఎండు ఖర్జూరాలో లభ్యమవుతాయి. వీటితో పాటు అదనంగా.. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, కె, బి2, బి2, నియాసిన్, థయామిన్ వంటి అనేక విటమిన్లు ఉన్నాయి. మరోవైపు పాలల్లో ఉండే కాల్షియం, పొటాషియంను పెంచేందుకు ఎండు ఖర్జూరా ఎంతగానో మేలు చేస్తుంది. ఈ నేపథ్యంలో వీటిని కలిపి తినడం వల్ల బలహీనతకు స్వస్తి పలకవచ్చు. 

పాలు, ఖర్జూరాల వల్ల పురుషులకు ఉపయోగాలు..

ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు అబర్ ముల్తానీ చెప్పిన వివరాలు ప్రకారం.. శారీరక, లైంగిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పురుషులు.. పాలు, వేరుశనగ తింటే మేలు చేస్తుంది. ఈ రెండింటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో బలహీనత నశిస్తుందని ఆయన తెలిపారు. 

మరోవైపు ఖర్జూరాలో టెస్టోస్టెరాన్ కు బుస్టింగ్ ఇచ్చే గుణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది పురుషుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు. పాలు తాగడం వల్ల శరీరంలో శక్తి పెంచడానికి ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. 

పాలు, వేరుశనగ వల్ల కలిగే ప్రయోజనాలు..

1) శరీరంలో శక్తిని పెంచేందుకు సహకరిస్తాయి. 
2) రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది
3) ఆస్తమా రోగులకు మేలు చేస్తుంది
4) బరువు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది
5) రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ మేలు చేస్తుంది. 

ప్రతిరోజూ పాలతో పాటు ఎండు ఖర్జూరాను తినడం వల్ల మేలు కలుగుతుంది. ఎండు ఖర్జూరాను పాలలో ఉడకబెట్టి కూడా తినవచ్చు.  

Also Read: Egg Yolk Protein: మీరు తినే కోడిగుడ్డు ఆరోగ్యకరమైనదేనా?- అందులో అధిక ప్రొటీన్లు ఉన్నాయా తెలుసుకోండిలా!

ALso Read: Cloves Side Effects: లవంగాలు ఎక్కువ తింటే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News