Beetroot Juice Benefits: బీపీని తగ్గించే రసం.. తాగితే ఈ వ్యాధులకు చెక్‌!

Beetroot Juice Benefits: బీట్రూట్ రసంలో శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు లభిస్తాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 16, 2024, 01:16 PM IST
Beetroot Juice Benefits: బీపీని తగ్గించే రసం.. తాగితే ఈ వ్యాధులకు చెక్‌!

Beetroot Juice Benefits In Telugu: బీట్రూట్ రుచి అంత లేకపోయినా దీనిని తినడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య ని గుణాలు చెబుతున్నారు. ఇందులో శరీరానికి కావలసిన విటమిన్స్ తో పాటు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. బీట్రూట్లో ఉండే కొన్ని ముఖ్యమైన  మూలకాలు రక్త పోటును తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. అయితే చాలామంది బీట్రూట్ తినేందుకు అంతగా ఇష్టపడరు. ఇలాంటివారు ప్రతిరోజు దీనితో తయారుచేసిన రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రసంలో ఉండే కొన్ని పోషకాలు శరీర పనితీరును మెరుగుపరిచేందుకు కూడా ఎంతగానో సహకరిస్తాయి. ఇవే కాకుండా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే రోజు ఉదయాన్నే బీట్రూట్ రసాన్ని తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి. 

రక్తపోటును తగ్గించడం:
బీట్‌రూట్‌లో రసంరేట్‌ అనే మూలకం లభిస్తుంది. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి అనేక రకాల ప్రయెజనాలను అందిస్తుంది. దీంతో పాటు నైట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాలను విడదీస్తుంది. దీని కారణంగా రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా కొంతమందిలో రక్తపోటును నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది. 

శారీరక పనితీరు:
బీట్‌రూట్ రసం కండరాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి నైట్రేట్లను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. అలాగే ఇది అథ్లెటిక్ పనితీరును మెరుగుపరచడానికి, అలసటను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: 
బీట్‌రూట్ రసంలో ఫైబర్ కూడా ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఈ జ్యూస్‌ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో పాటు మలబద్ధకాన్ని నివారించడానికి కూడా ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది. 

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
బీట్రూట్ రసంలో విటమిన్ ఎ, సిలు లభిస్తాయి. ఇవి రెండూ చర్మ ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడతాయి. దీంతో పాటు ఈ విటమిన్లు చర్మాన్ని హైడ్రేట్‌గా చేయడానికి ముడతలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రసం తాగాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: 
బీట్‌రూట్ రసంలో విటమిన్ సితో పాటు పోషకాలు అధికంగా లభిస్తాయి. దీంతో పాటు యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. ఇవి కణాన్నిదెబ్బ తినడాన్ని ఆపేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News