Banana Side Effects: అరటిపండ్లు ఎక్కువగా తింటున్నారా... అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్‌తో జాగ్రత్త...

Banana Side Effects: అరటిపండ్లు ఎవరికి మాత్రం ఇష్టముండదు. అయితే అరటిపండ్లు అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 8, 2022, 03:40 PM IST
  • అరటి పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
  • అరటి పండ్లు ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావొచ్చు
  • అరటిపండ్లు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి
Banana Side Effects: అరటిపండ్లు ఎక్కువగా తింటున్నారా... అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్‌తో జాగ్రత్త...

Banana Side Effects: అరటిపండు మంచి బలవర్ధకమైన ఆహారం. రెగ్యులర్‌గా జిమ్‌కి వెళ్లే వారు దేహ పుష్ఠి కోసం అరటిపండ్లు తీసుకుంటారు. మిల్క్ షేక్స్‌గా కూడా అరటిపండ్లను తీసుకోవడం తెలిసిందే. అరటిపండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నది వాస్తవం. అయితే అధికంగా అరటిపండ్లు తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదు.

అరటిపండ్లు ఎక్కువగా తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ :

మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు అరటిపండ్లు ఎక్కువగా తీసుకోవద్దు. అరటిపండ్లలో ఉండే టైరమైన్ అనే పదార్ధం మైగ్రేన్ నొప్పిని పెంచుతుంది. కొంతమందిలో అరటిపండ్లు ఎలర్జీకి కారణమవుతాయి. అలాంటివారు అరటిపండ్లు తీసుకోకపోవడం మంచిది.

అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అరటిపండ్లు అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో పొటాషియం అధికంగా చేరి, హైపర్‌కలేమియాకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో గుండెపోటుకు కూడా కారణం కావచ్చు. అరటిపండులో పిండి పదార్ధం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అరటిపండు తినడం వల్ల దంత సమస్యలు కూడా వస్తాయి.

అరటిపండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. బరువు తగ్గాలనుకునేవారు అరటింపండ్లు తీసుకోవద్దు. అరటిపండ్లలో ఎక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి... అవి మీ శరీర బరువును పెంచుతాయి. 

మధుమేహం ఉన్నవారు అరటిపండ్లు తినకూడదు. అరటిపండ్లలో చక్కెర అధిక స్థాయిలో ఉంటుంది. కాబట్టి అరటిపండ్లు తింటే బ్లడ్ షుగర్ పెరిగి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు అరటిపండ్లు తీసుకోకపోవడం మంచిది.

Also Read: Startup Policies: మధ్యాహ్నం కునుకు తీయొచ్చు.. అన్‌లిమిటెడ్ లీవ్స్ తీసుకోవచ్చు.. ఈ స్టార్టప్స్‌ ఉద్యోగులకు స్వర్గధామమే..

Also Read;Delhi Capitals Covid: ఢిల్లీ జట్టులో మరోసారి కరోనా కలకలం.. ఐసోలేషన్‌లో ప్లేయర్స్! చెన్నైతో మ్యాచ్ డౌటే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News