Baldness Prevent In 30 Days: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలిపోవడం, జుట్టు తెల్ల బడిపోవడం వంటి సమస్యల బారిన పడుతుండడం విశేషం. కానీ ప్రస్తుతం చాలా మంది 25 నుంచి 30 ఏళ్ల యువత బట్టతల సమస్యలు రావాడం పెద్ద సమస్యగా మారింది. అంతేకాకుండా పెళ్లికి ముందే ఇలాంటి సమస్యల బారిన పడి బాధపడుతున్నారు. అయితే బట్ట తల అనేది జన్యుపరంగా రావొచ్చు.. లేదా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా రావొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్య రావడానికి ముందే పలు రకాల సాంకేతాలు కూడా ఉత్పన్నమవుతాయి. పలువరు ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం.. తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే క్రమంలో పలు రకాల ఔషధ గుణాలు కలిగిన నూనెలను కూడా వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ నూనెలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మంచి జుట్టు కోసం ఇలా చేయ
1. బాధం నూనె:
ఆల్మండ్ ఆయిల్‌లో ప్రోటీన్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. జుట్టుపై పేరుకుపోయిన చెడు సూక్ష్మ పదార్థాలను తొలగించేందుకు కృషి చేస్తుంది. ఈ నూనె క్రమం తప్పకుండా జుట్టుకు పట్టిస్తే జుట్టు సమస్యలన్నీ దూరమవుతాయి.
2. కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెలో వెంట్రుకలకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. అయితే ఈ నూనెను ప్రతి రోజూ ఉదయం పూట 1 గంట స్నానానికి ముందు పట్టిస్తే జుట్టుకు సంబంధించి అన్ని సమస్యలు దూరమవుతాయి.
3. ఆలివ్ ఆయిల్:
శరీర దృఢత్వం కోసం ప్రస్తుతం చాలా మంది ఆలివ్ ఆయిల్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇందులో ఉండే గుణాలు వెంట్రుకలను కూడా బలంగా చేస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. కావున జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ నూనెను వినియోగించండి.
4. ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయలో ఉండే గుణాలు కూడా వెంట్రుకలను బలంగా చేస్తాయని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. ఇది జుట్టును మెరుగు పరిచి.. శక్తి వంతంగా చేస్తుంది.
Also Read: MP Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Also Read: ప్రభాస్, కీర్తి సురేష్, దేవిశ్రీల ‘హర్ ఘర్ తిరంగా’ సాంగ్.. చూశారా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook