Apple Vinegar Benefits: యాపిల్ వెనిగర్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే దీనిని యాపిల్ రసంతో తయారు చేస్తారు. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు మధుమేహం, కడుపు సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ వెనిగర్‌ను చాలా మంది ఇష్టం వచ్చిన సమయాల్లో తీసుకుంటున్నారు. ఇంతకీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తాగడం మంచిదేనా? యాపిల్ వెనిగర్‌ను ఏయే సమయాల్లో తీసుకోవడం వల్ల శరీరానికి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
యాపిల్ వెనిగర్‌ను ప్రతి రోజు తీసుకోవడం శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది అధిక మోతాదులో తీసుకుంటున్నారు. మధుమేహంతో బాధపడేవారు దీనిని ఖాళీ కడుపుతో తీసుకుంటున్నారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గుతాయా? ఖాళీ కడుపుతో తీసుకోవడం మర్చి పోయిన వారు ఎలా తాగాలో ఇప్పుడు ఇప్పుడు తెలుసుకోండి.
యాపిల్ వెనిగర్ తాగడానికి సరైన సమయం ఇదే:
యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకునేవారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..ఖాళీ కడుపుతో ప్రతి రోజు ఉదయం పూట తీసుకోవడం మంచి ఫలితాలు పొందుతారు. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి రోజు అల్పాహారానికి ముందు దీనిని తీసుకోవడం ఉత్తమని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో యాపిల్ వెనిగర్ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. డయాబెటిక్ పేషెంట్స్ ఇలా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు సులభంగా నియంత్రణలో ఉంటాయి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
యాపిల్ సైడర్ వెనిగర్ ప్రయోజనాలు:
యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
జీర్ణక్రియ సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇందులో ఉండే గుణాలు ఆకలిని నియంత్రించి, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తాయి.
అంతేకాకుండా కొలెస్ట్రాల్‌తో పాటు బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
చర్మం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter