Eye Treatment With iPhone 13: ప్రస్తుతం అందుబాటులో వచ్చే స్మార్ట్‌ఫోన్లు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కలిగి ఉంటున్నాయనేది అందరికీ తెలిసిందే. మరీ కంటి వైద్యం చేసేంత టెక్నాలజీ ఉందా అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఆధునిక వైద్య చరిత్రలో నిజంగా ఇదొక అద్భుతం. శరీరంలో సున్నితమైన భాగంగా ఉన్న కంటి వైద్యం కోసం ఓ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడమంటే..నమ్మలేకపోతున్నారా. నిజమే. స్మార్ట్‌ఫోన్‌లోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కంటిచూపు మెరుగుపర్చేందుకు ప్రయత్నించి సఫలమైన ఘటన ఇది. యాపిల్ ఐఫోన్ 13తో కంటి వైద్యం చేస్తున్నాడు ఆ వైద్యుడు. వివరాలు పరిశీలిద్దాం.
అమెరికా(America)కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ప్రాంతానికి చెందిన టామీ కార్న్..టెక్సాస్ సౌత్ వెస్ట్రన్ మెడికల్ యూనివర్శిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. గత 21 ఏళ్లుగా కంటి వైద్యుడిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం షార్ప్ మెమోరియల్ ఆపత్రిలో ప్రముఖ కంటి వైద్య నిపుణుడిగా, డిజిటల్ ఇన్నోవేటర్‌గా పని చేస్తున్నారు. ఈయన కొత్తగా కంటి చూపును మెరుగుపర్చేందుకు ఐఫోన్ 13 ఉపయోగించారు. యాపిల్ ఐఫోన్ 13లో(iPhone13) ఉన్న మాక్రో మోడ్ టెక్నాలజీ సహాయంతో కంటి సమస్యల్ని పరిష్కరించడం ప్రారంభించారు. చికిత్స తీసుకున్నరోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వినడానికి ఆశ్చర్చంగా ఉన్నా ముమ్మాటికీ నిజమే ఇది. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రో మోడ్ టెక్నాలజీతో కంటి చికిత్స అందిస్తున్నారు. ఈ విధానంతో కంటిచూపు (Eye Treatment with iPhone 13)ఏ స్థాయిలో ఉందో గుర్తించి ఫోటోల్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఆ ఫోటోల సహాయంతో కార్నియా ఆపరేషన్ అనంతరం ఎదురయ్యే రాపిడి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. సాధారణ చికిత్సతో పరిష్కరించలేని సున్నితమైన సమస్యల్ని మ్యాక్రో మోడ్ టెక్నాలజీతో(Macro mode technology)సాధ్యం చేసిన విధానాన్ని ప్రొఫెషనల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు.
Also read: Inspiration 4 Streaming:ఎలాన్ మస్క్ కొత్త ప్రయోగం, ఇన్‌స్పిరేషన్ 4 యాత్ర మొత్తం నెట్‌ఫ్లిక్స్‌లో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి