Amla And Honey Mix Benefits: మధుమేహంతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

Amla And Honey Mix Benefits: ప్రస్తుతం డయాబెటిక్ వ్యాధి చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని కబళిస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు మంచి పోషకాలుండే ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్‌లో  పలు రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని వారు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 4, 2022, 05:01 PM IST
  • తేనెలో ఉసిరికాయను కలపి తినండి
  • మధుమేహం నుంచి ఉపశమనం పొందండి
  • శరీరానికి అనేక ప్రయోజనాలను ఇస్తుంది
Amla And Honey Mix Benefits: మధుమేహంతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

Amla And Honey Mix Benefits: ప్రస్తుతం డయాబెటిక్ వ్యాధి చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని కబళిస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు మంచి పోషకాలుండే ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్‌లో  పలు రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని వారు తెలుపుతున్నారు. డయాబెటిక్ పేషెంట్లు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉసిరికాయ తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఈ ఉసిరిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి.. శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

దీనిని ఉసిరితో కలపండి:

ఉసిరితో తేనె కలిపి తినడం ద్వారా శరీరానికి మంచి లాభాలనిస్తుంది. ఇందులో ఆమ్లా యాంటిసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌తో పాటు విటమిన్ సి ఉంటుంది. కావున వీటిని కలిపి తినడం వల్ల శరీరానికి అనేక లాభాలు పొందవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 

ఉసిరి, తేనె కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

1. డయాబెటిస్‌:

ఉసిరిలో ఉండే యాంటీ-డయాబెటిక్ గుణాలు డయాబెటిక్ రోగులకు మంచి ఔషధంగా పని చేస్తుంది. ఉసిరి, తేనె కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

2.  కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది:

ఉసిరికాయలో ఫైబర్ విలువలు పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి.. విసర్జనలో ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది.

3. జుట్టుకు మేలు చేస్తుంది:

ఉసిరిని చాలా మంది హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌లో ఉపయోగిస్తారని మనకు తెలుసు. ఎందుకంటే ఇది జుట్టును ఆరోగ్యంగా, నల్లగా ఉంచేందుకు కృషా చేస్తుంది.   ఉసిరితో పాటు తేనెను కూడా అందులో కలుపుకుని తింటే...స్కాల్ప్‌లో ఇన్‌ఫెక్షన్‌ నుంచి విముక్తి పొందవచ్చు.

4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

ఉసిరి, తేనె శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతో కృషి చేస్తుంది. అంతే కాకుండా అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. 

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Thursday Tips: గురువారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఈ పనులు చేయకూడదు!

Also Read: Dark Circles Under Eyes: కళ్ల కింద నల్లటి వలయాలు కనిపిస్తే.. ఈ 5 పోషకాలను ఆహారంలో చేర్చుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News