Almonds Nutrition Benefits: డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యనికి ఏంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే డ్రై ఫ్రూట్స్‌లో బాదం పప్పు ఒకటి. బాదం పప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ బాదం పప్పు తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను అదుపు ఉంచుతుంది. అంతేకాకుండా వీటిలో అనేక రకాల పోషకాలు దాగి ఉన్నాయి. అయితే బాదం పప్పు తీసుకోవడం వల్ల కలిగే మరి కొన్ని ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
● బాదంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి.
● చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో బాదం ఎంతో సహాయపడుతుంది.
● బాదం బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంతో ఎంతో ఉపయోగపడుతుంది.
● గుండె జబలుబారిన పడకుండా ఉండాలి అంటే ప్రతిరోజు బాదం గింజలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
● అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు ఈ బాదం గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
● బరువు సమస్యలతో బాధపడుతున్నవారు బాదం పప్పలు తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
● బాదం కంటికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
● బాదం పప్పులో అధిక శాతం విటమిన్ ఇ లభిస్తుంది. విటమిన్ ఇ లోపం ఉన్నవారు ఈ బాదం పప్పు తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.
Also read: Walking Tips: వాకింగ్ ఎప్పుడు చేస్తే మంచిది, ఉదయమా.. సాయంత్రమా
● బాదం పప్పును ప్రతిరోజు తీసుకోవడం వల్ల చర్మ కణాలకు సరిపోయే పోషకాలు అందుతాయి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
● అంతేకాకుండా బాదం పప్పు పొట్టు తీసి తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.
● బాదం పప్పు మెదడు పనితీరు మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. దీని వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
● ఎముకలు దృఢంగా ఉంచడంలో బాదం ఎంతో మేలు చేస్తుంది.
● డయాబెటిస్ సమస్య ఉన్నవారు షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో బాదం పప్పు ఉపయోగపడుతుంది.
● బాదం పప్పు ప్రతిరోజు తీసుకోవడం వల్ల క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ ఇతర సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.
ఈ విధంగా బాదం పప్పును తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా ప్రతిరోజు దీని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Pomegranate Benefits: రోజూ పరగడుపున దానిమ్మ తింటే ఇన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook