Zee Telugu News 3Rd Anniversary Celebration: జీ న్యూస్ సంస్థ యువతకు ఉపాధి కల్పించడమే కాకుండ, నిరుపేద కుటుంబాలకు అన్నదానాలు నిర్వహిస్తూ వస్తోంది. వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ సమాజంలో తమదైన శైలిలో ముద్ర వేసుకుంటూ వస్తోంది. ఇటీవలే జీ తెలుగు న్యూస్ మూడు వసంతాలు పూర్తిచేసుకుని నాలగవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుపేద కుటుంబాలకు, వేములవాడ రాజన్న ఆలయం ముందు ఉండే యాచకులకు, జీ తెలుగు న్యూస్ టీం అన్నదానం నిర్వహించింది.
ఆకలి కేకలతో బిక్కు బిక్కు మంటూ చూస్తున్న ఆ నిరుపేదలకు, జీ తెలుగు న్యూస్ అనివర్సరీ సందర్భంగా అన్నదానం చేశారు. వేములవాడ పట్టణంలోని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 150 మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టినరోజులు, పెళ్లిరోజు ఇతర కార్యక్రమాలకు కేకులు కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్న ఈ తరంలో, జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ నేతృత్వంలో వారి టీం అన్నదానం చేయడం, ఎంతోమందికి కడుపు నింపిందన్నారు.
జీ తెలుగు న్యూస్ రెండు వసంతాలు పూర్తిచేసుకుని నాలుగవ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా అనార్థులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని, చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్‌కు, మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇలా భవిష్యత్‌లో కూడా అనేక వసంతాలు పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter