‘వినయ విధేయ రామ’ టీజర్‌ విడుదల.. ఫుల్ ఎనర్జీతో రామ్ చరణ్

‘అన్నయ్యా..వీడిని చంపేయాలా? భయపెట్టాలా?’ భయపెట్టాలంటే పది నిమిషాలు, చంపేయాలంటే పావుగంట.. ఏదైనా ఓకే. సెలెక్ట్‌ చేస్కో’... ఇదీ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’  టీజర్‌లో చెప్పే తొలి డైలాగ్.

Last Updated : Nov 9, 2018, 11:22 AM IST
‘వినయ విధేయ రామ’ టీజర్‌ విడుదల.. ఫుల్ ఎనర్జీతో రామ్ చరణ్

‘అన్నయ్యా..వీడిని చంపేయాలా? భయపెట్టాలా?’ భయపెట్టాలంటే పది నిమిషాలు, చంపేయాలంటే పావుగంట.. ఏదైనా ఓకే. సెలెక్ట్‌ చేస్కో’... ఇదీ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’  టీజర్‌లో చెప్పే తొలి డైలాగ్. ‘రేయ్‌.. పందెం  పరశురాం అయితే ఏంట్రా..  ఇక్కడ రామ్‌..రామ్‌..రామ్‌ కొణిదెల’ అని రామ్ చరణ్ చెప్పిన డైలాగ్‌కి అప్పుడే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌కు  జోడీగా కియారా అడ్వాణీ నటించిన ఈ సినిమాలో వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించడం గమనార్హం.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. సంక్రాంతికి  ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మాస్ మసాలా సినిమాలను తెరకెక్కించే బోయపాటి శ్రీను ఈ సినిమాకి కూడా డైరెక్షన్ చేయడం విశేషం. తమిళ నటుడు ప్రశాంత్‌తో పాటు ఆర్యన రాజేష్, స్నేహ ఈ చిత్రంలో  ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది.

న‌వంబ‌ర్ 9 నుండి ఈ సినిమా డ‌బ్బింగ్ ప్రారంభిస్తామని దర్శకులు తెలిపారు. ఈ చిత్రానికి రిషి పంజాబీ, ఆర్థర్ ఏ విల్సన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కనల్ కన్నన్ ఈ చిత్రానికి స్టంట్స్ సమకూరుస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనరుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Trending News