ఎక్కువ కాలం ఆడిన బాలీవుడ్ చిత్రాలివే..!

తగిన ప్రేక్షకాదరణ అనేది ఉండాలే గానీ.. కొన్ని చిత్రాలు నమోదు చేసే రికార్డులు చరిత్రలో నిలిచిపోతాయనడంలో సందేహం ఉండదు. అలా ప్రేక్షకాదరణ పొందిన పలు చిత్రాలు సంవత్సరాల తరబడి కూడా ఒకే థియేటర్లో ప్రదర్శించబడడం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. బాలీవుడ్‌లో అలా రికార్డులు సాధించిన సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ చిత్రాల గురించి మనం కూడా తెలుసుకుందామా

Last Updated : May 21, 2018, 08:03 PM IST
ఎక్కువ కాలం ఆడిన బాలీవుడ్ చిత్రాలివే..!

తగిన ప్రేక్షకాదరణ అనేది ఉండాలే గానీ.. కొన్ని చిత్రాలు నమోదు చేసే రికార్డులు చరిత్రలో నిలిచిపోతాయనడంలో సందేహం ఉండదు. అలా ప్రేక్షకాదరణ పొందిన పలు చిత్రాలు సంవత్సరాల తరబడి కూడా ఒకే థియేటర్లో ప్రదర్శించబడడం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. బాలీవుడ్‌లో అలా రికార్డులు సాధించిన సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ చిత్రాల గురించి మనం కూడా తెలుసుకుందామా

దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే
గత 21 సంవత్సరాలుగా ఈ చిత్రం ఒకే థియేటర్‌లో నిరాటంకంగా ప్రదర్శించబడుతూ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. ముంబయిలో మరాఠా మందిర్ థియేటర్లో ఈ సినిమా 1995 సంవత్సరం నుండీ ఈ రోజు వరకూ ప్రదర్శనకు నోచుకుంటోంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాను కేవలం మార్నింగ్ షోలకు మాత్రమే పరిమితం చేశారు. అయినా సినిమాను మాత్రం మార్చకపోవడం విశేషం. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో బడ్జెట్‌తో తెరకెక్కిన "దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే" చిత్రం లైఫ్ టైమ్ రన్‌లో దాదాపు రూ.120 కోట్లను వసూలు చేయడం విశేషం.

షోలే
అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కథానాయకులుగా నటించిన "షోలే" సినిమా ఎంత పెద్ద హిట్ చిత్రమో మనకు తెలియంది కాదు. 1975లో విడుదలైన ఈ సినిమా భారతదేశంలో అనేక థియేటర్లలో దాదాపు 5 సంవత్సరాలు నిరాటంకంగా ప్రదర్శనకు నోచుకుందట. ఈ మధ్యకాలంలోనే ఈ సినిమాను త్రీడీ ఫార్మాట్‌లో కూడా విడుదల చేశారు. పాకిస్తాన్‌లో కూడా ఈ చిత్రం అనేక రికార్డులు బ్రేక్ చేసింది. 

మొఘల్ ఏ ఆజమ్ 
1960 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం అప్పట్లోనే రూ.1.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. మధుబాల, దిలీప్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 3 సంవత్సరాలు నిరాటంకంగా అనేక థియేటర్లలో ప్రదర్శనకు నోచుకుంది. ఈ సినిమా కలర్ వెర్షన్ 2004లో విడుదలైంది. అనేక జాతీయ పురస్కరాలను కూడా చిత్రం కైవసం చేసుకుంది.

కిస్మత్
1943 సంవత్సరంలో విడుదలైన "కిస్మత్" చిత్రం బాలీవుడ్ పరిశ్రమకు సంబంధించి తొలి బ్లాక్ బస్టర్ చిత్రం. అశోక్ కుమార్, ముంతాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 3 సంవత్సరాలు నిరాటంకంగా అనేక థియేటర్లలో ప్రదర్శించబడింది. కోల్‌కతాలోని రోక్సీ సినిమాలోనే దాదాపు 187 వారాలు ఈ చిత్రం ప్రదర్శించబడి సరికొత్త రికార్డులు బ్రేక్ చేసింది. 

బర్సాత్ 
1949లో రాజ్ కపూర్, నర్గీస్ ప్రధాన పాత్రల్లో నటించిన "బర్సాత్" చిత్రం అనేక రికార్డులను బ్రేక్ చేసింది. దాదాపు 2 సంవత్సరాలు ఈ చిత్రం వివిధ థియేటర్లలో ప్రదర్శనకు నోచుకుంది. ఈ సినిమా విజయం సాధించాకే రాజ్ కపూర్ స్వయంగా ఆర్కే స్టూడియోస్ కొనుగోలు చేశారు. 

మైనే ప్యార్ కియా 
సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఒక సంవత్సరం పాటు వివిధ థియేటర్లలో ఆడింది. 1989లో విడుదలైన ఈ చిత్రం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి అప్పట్లోనే రూ.14 కోట్లు వసూలు చేసింది. అనేక థియేటర్లలో ఈ సినిమా 50 వారాల పాటు ఆడింది.

హమ్ ఆప్కే హై కౌన్
సూరజ్ బర్జాత్య దర్శకత్వంలో 1994లో సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన "హమ్ ఆప్కే హై కౌన్" చిత్రం ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఈ చిత్రం కూడా దాదాపు ఒక సంవత్సరం పాటు ఆడింది. రూ.1.35 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లోనే రూ.100 కోట్ల మార్కు దాటింది.

రాజా హిందుస్థానీ
అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఈ చిత్రం కూడా దాదాపు 1 సంవత్సరం పాటు ఆడింది. 1996లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లోనే రూ.70 కోట్లకు పైగా వసూలు చేసింది.

కహో నా ప్యార్ హై
హృతిక్ రోషన్, అమీషా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఎన్నో బాలీవుడ్ రికార్డులను బీట్ చేసింది. 2000లో విడుదలైన ఈ చిత్రం రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.62 కోట్ల వరకూ వసూలు చేసింది. దాదాపు 50 వారాల పాటు ఈ చిత్రం వివిధ థియేటర్లలో ఆడింది. 

మొహబ్బతే
అమితాబ్, షారుఖ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 2000లో విడుదలైంది. ఈ చిత్రం కూడా 50 వారాల పాటు నిలకడగా ఆడి రికార్డులు బ్రేక్ చేసింది. 

Trending News