పవర్ స్టార్ ఫ్యాన్స్ బీ రెడీ..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్న క్షణం మరికొద్ది గంటల్లోనే రానుంది. 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. దీంతో సినిమాలకు దూరమయ్యారు. తాజాగా ఆయన హిందీ చిత్రం 'పింక్' రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Last Updated : Mar 2, 2020, 08:41 AM IST
పవర్ స్టార్ ఫ్యాన్స్ బీ రెడీ..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్న క్షణం మరికొద్ది గంటల్లోనే రానుంది. 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. దీంతో సినిమాలకు దూరమయ్యారు. తాజాగా ఆయన హిందీ చిత్రం 'పింక్' రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్‌ను ఇవాళ విడుదల చేయనున్నారు.  సాయంత్రం 5 గంటలకు సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. 

ఐతే ఇంతకు ముందే ఫ్యాన్స్ ను మరింత సంతోషపెట్టేందుకు సినిమాకు సంబంధించిన ప్రీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న పవర్ స్టార్ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ. . శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ట్వీట్ చేసింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ఎక్కువగా ఈ చిత్రానికి వకీల్ సాబ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఐతే ఫ్యాన్స్ కోరుకుంటున్న అదే టైటిల్ ను చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Read Also: పవన్ ఫ్యాన్స్‌కు రెండు రోజుల్లో పండగ

అన్ని హంగులు పూర్తి చేసుకుని సినిమాను వేసవిలో విడుదల  చేసేందుకు చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తోంది.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News