హీరో నితిన్ పెళ్లి తేది, వేదిక ఖరారు

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన హీరో నితిన్ త్వరలో పెళ్లిపీటలు(Nithin Wedding Date) ఎక్కబోతున్నారు. ఇప్పట్లో కరోనా వైరస్ అరికట్టడం సాధ్యం కాదని, లాక్‌డౌన్‌లు కొనసాగుతూనే ఉంటాయని ఇరుకుటుంబాలు నితిన్, షాలినిల వివాహానికి ముహూర్తం నిర్ణయించారు.

Last Updated : Jul 1, 2020, 01:17 PM IST
హీరో నితిన్ పెళ్లి తేది, వేదిక ఖరారు

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వివాహానికి(Nithin Wedding) వేదిక, ముహూర్తం నిశ్చయించినట్లు తెలుస్తోంది. జులై 26న తాను ప్రేమించిన షాలినిని నితిన్ వివాహం చేసుకోబోతున్నాడు. వాస్తవానికి ఏప్రిల్ 16న నితిన్ వివాహం జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా తన పుట్టినరోజు వేడుకలతో పాటు వివాహాన్ని నితిన్ (Nithin Marriage) వాయిదా వేసుకున్నాడు. హీరో నితిన్, శాలిని ఎంగేజ్ మెంట్ ఫొటోలు

ఈ నెల 26వ తేదీన జరగనున్న నితిన్ (Nithin Marriage Date), షాలినిల వివాహానికి హైదరాబాద్ ఫలక్‌నామా ప్యాలస్‌ వేదికగా ఎంచుకున్నారు. కేవలం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిపేందుకు నిశ్చయించారు. నితిన్ తన ప్రేమ విషయాన్ని తెలిపి ప్రపోజ్ చేయగా షాలిని అంగీకరించింది. ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే చెప్పాయి. ఆ హీరోయిన్ వచ్చిన వేళా విశేషం.. నితిన్‌కు పెళ్లి!

ఈ ఏడాది ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లో నితిన్, షాలిని ఎంగేజ్‌మెంట్ కొందరు సన్నిహితుల మధ్య జరిగింది. కాగా, ఏప్రిల్ 16 దుబాయ్ వేదికగా నితిన్, షాలినిలు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేయగా, కరోనా, లాక్‌డౌన్‌ల వల్ల వాయిదా వేసుకున్నారు. కరోనా నియంత్రణ కాకపోవడం, లాక్‌డౌన్‌లు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు కుటుంబాలు వివాహం జరిపించడానికి మొగ్గుచూపాయి. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!

Trending News