/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

కొన్ని సందర్భాలలో నిర్మాతలు తమ సినిమాలకు చిత్రమైన పేర్లు పెట్టడం మనం చూస్తూ ఉంటాం. వంటకాల పేర్లు, హోటళ్ల పేర్లు, తినుబండారాల పేర్లు కూడా సినిమాలకు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్రేక్షకులకు సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుందన్న భావనను కలిగించడం కోసమే ఆ ప్రక్రియను ఎంచుకుంటూ ఉంటారు దర్శకులు, ప్రొడ్యూసర్లు. అయితే అలాంటి సినిమాల్లో హిట్ అయినవీ. ఫట్ అయినవి కూడా ఉన్నాయి. ఆ విధమైన హాట్ హాట్ సినిమాల్లో కొన్నింటిని  గురించి మనం కూడా తెలుసుకుందాం..!

కారందోశ - 2016లో విడుదలైన "కారందోశ" చిత్రంలో కూడా దోశలమ్మే హోటల్ యజమాని కథలో ముఖ్యపాత్ర పోషించడం విశేషం. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కొత్త దర్శకుడి ప్రయత్నాన్ని కొందరు  హర్షించినా.. కారందోశ సినిమా టేస్ట్ అంతగా లేదని తేల్చేశారు. 

పెసరట్టు - 2015లో క్రౌడ్ ఫండింగ్ తీసుకొని మరీ చిత్ర విమర్శకుడు కత్తి మహేష్.. పెసరట్టు సినిమాని తెరకెక్కించారు. ఇద్దరు ప్రేమికుల జీవితంలోకి కొసమెరుపుగా క్లైమాక్స్‌లో పెసరట్టు ప్రధానంగా ఎలాంటి పాత్ర పోషించింది  అనేది కథలో ఒక భాగం. అయితే ఈ సినిమానీ చాలా లైట్‌గా తీసుకున్నారు జనం. ఫలితంగా చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 

బిర్యానీ - 2013లో తమిళంలో కార్తీగా హీరోగా బ్లాక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన "బిర్యానీ" చిత్రంలో కథ కూడా విచిత్రమైంది. పాజిటివ్ ఫీడ్ దక్కించుకున్న ఈ సినిమాలో హీరోకి మద్యం తాగిన తర్వాత బిర్యానీ తినే వీక్‌నెస్ ఉంటుంది. అదే కథను మలుపు తిప్పుతుంది.  

ఉలవచారు బిర్యానీ - 2014లో విడుదలైన ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లు ఇద్దరూ మంచి తిండి ప్రియులు కావడం విశేషం. ప్రకాష్ రాజ్, స్నేహ కలిసి నటించిన ఈ చిత్రం తమిళ, కన్నడ భాషలలో కూడా తెరకెక్కింది. ఈ చిత్రానికి ప్రకాష్ రాజే దర్శకత్వం వహించారు. 

ఆవకాయ్ బిర్యానీ- 2008లో అనీష్ కురువిల్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఆవకాయ్ బిర్యానీ చిత్ర కథ చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఆవకాయ తయారుచేసి అమ్మే ఒక బ్రాహ్మణ అమ్మాయి, ఓ ముస్లిం అబ్బాయితో ప్రేమలో పడడమే ఈ సినిమా కథ. 

పిజ్జా - 2012లో విడుదలైన ఈ సినిమాలో హీరో ఒక పిజ్జా షాపులో పనిచేస్తుంటాడు. పిజ్జా డెలివరీ చేయడానికి ఓ ఇంటికి వెళ్లినప్పుడు తనకు ఎదురైన అనుభవాలే ఈ సినిమా. ఈ హారర్ చిత్రం సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. 

వంకాయ ఫ్రై - 2011లో కూడా సుమిత్ అరోరా, బ్రహ్మానందం నటించిన "వంకాయ ఫ్రై" అని సినిమా విడుదలైంది. అయితే ఫ్రైని ఆస్వాదించడానికి ఎవ్వరూ మొగ్గు చూపలేదు. అందుకే ఈ సినిమా ఎప్పుడు విడుదలైందో కూడా ప్రేక్షకులు గుర్తుపెట్టుకోలేదు.

బాబాయ్ హోటల్ - 1992లో బ్రహ్మానందం హీరోగా నటించిన "బాబాయ్ హోటల్" హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో హోటల్ నడిపే బాబాయి పాత్రలో బ్రహ్మానందం ఒదిగిపోయి నటించారు. ఈ సినిమా విడుదలయ్యాక... అనేక మంది హోటల్ యజమానులు తమ హోటళ్లకు "బాబాయ్ హోటల్" అని పేరు పెట్టడం విశేషం. 

కాఫీబార్ - కోకిల, సంకీర్తన లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు గీతాక్రిష్ణ తీసిన సినిమా "కాఫీబార్". హీరో, హీరోయిన్లు ఓ సందర్భంలో కాఫీబార్‌లో మీట్ అవ్వడం తప్పితే..  టైటిల్‌కి, సినిమా సబ్జెక్టుకి అంతగా సంబంధం లేకపోవడంతో.. ఈ చిత్రం కూడా పెద్దగా ఆదరణకు నోచుకోలేదు.

పాకశాల- 2015లో ఫణిక్రిష్ణ అనే దర్శకుడు తీసిన "పాకశాల" చిత్రం టైటిల్ వరకూ బాగానే ఉన్నా.. సినిమాపరంగా అంత ఇంపాక్ట్ తీసుకురాలేకపోయింది. ఈ సినిమా విడుదలైందన్న విషయం కూడా చాలా మందికి తెలియక పోవచ్చు. ఇంతకూ పాకశాల అంటే అర్థం ఏమిటో తెలుసా.. కిచెన్ అని అర్థం..!

Section: 
English Title: 
Telugu films and there names based on recipes and hotels
News Source: 
Home Title: 

ఈ సినిమా పేర్లు చాలా హాట్ గురూ..!

ఈ సినిమా పేర్లు చాలా హాట్ గురూ..!
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఈ సినిమా పేర్లు చాలా హాట్ గురూ..!
Publish Later: 
No
Publish At: 
Sunday, November 4, 2018 - 18:32