మొబైల్ యాప్‌తో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన దర్శకుడు సుకుమార్ భార్య

మొబైల్ యాప్‌తో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన దర్శకుడు సుకుమార్ భార్య

Last Updated : Nov 9, 2018, 03:34 PM IST
మొబైల్ యాప్‌తో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన దర్శకుడు సుకుమార్ భార్య

బ్లాక్ బస్టర్ సినిమాలతో గొప్ప దర్శకుడిగా తనకంటూ ఓ మంచి పేరు తెచ్చుకున్నాడు సుకుమార్. సుకుమార్ చివరి సినిమా రంగస్థలం సైతం బ్లాక్ బస్టర్ హిట్ అయి, యూనిట్ సభ్యులకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇదిలావుండగా తాజాగా సుకుమార్ భార్య కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందేలా ఓ మొబైల్ యాప్ ఆధారిత వ్యాపార సంస్థను ప్రారంభించారు. లాండ్రీ కార్ట్ అనే మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులకు లాండ్రీ సేవలు అందించడమే ఈ వ్యాపార సంస్థ చేసే పని. అందుకోసం ఆమె లాండ్రీ కార్ట్ అనే మొబైల్ యాప్‌ని ప్రత్యేకంగా రూపొందించి, విడుదల చేయించారు. 

మొబైల్ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన వినియోగదారుల ఇంటికే వచ్చి దుస్తులు తీసుకెళ్లడంతోపాటు ఉతికి, ఇస్త్రీ చేసి డెలివరి చేయడం వరకు యాప్ నిర్వాహకులే బాధ్యత వహిస్తారు.

Trending News