రానా దగ్గుబాటిపై శ్రీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

లీడర్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రానా దగ్గుబాటి ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లలో తనదైన ముద్ర వేసుకున్నాడు. అయితే మూడు పదుల వయసు దాటి చాలా ఏళ్లు అవుతున్నా ఇంకా ఎందుకు పెళ్లిపై

Last Updated : May 14, 2020, 07:37 PM IST
రానా దగ్గుబాటిపై శ్రీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

హైదరాబాద్: లీడర్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రానా దగ్గుబాటి ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లలో తనదైన ముద్ర వేసుకున్నాడు. అయితే మూడు పదుల వయసు దాటి చాలా ఏళ్లు అవుతున్నా ఇంకా ఎందుకు పెళ్లిపై వార్తల వచ్చిన నేపథ్యంలో వాటన్నింటికి చెక్ పెట్టేశారు. తన ప్రేమను ప్రేయసి అంగీకరించనట్టు భల్లాలదేవుడు ప్రకటించాడు. త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. మిహీకా బజాజ్ అనే యువతితో ప్రేమలో ఉన్నట్లు రానా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమెతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి ఆమె యస్ చెప్పిన విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు రానాకు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, రామ్ చరణ్ ,మంచు మనోజ్ ,రాజమౌళి, సమంత పలువురు సెలెబ్రిటీలంతా స్పందించారు. 

ఇదిలాఉండగా తరుచూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే నటి శ్రీ రెడ్డి కూడా రానా పెళ్లిపై స్పందించింది. శ్రీ రెడ్డి స్పందిస్తూ.. నీ లైఫ్‌లో ఏం జరిగిందో నాకు తెలుసు రానా గారు అంటూ ఈ అమ్మాయితో ప్రశాంతమైన జీవితం కొనసాగించాలని పోస్ట్ చేసింది. శ్రీ రెడ్డి చేసిన పోస్ట్ తో అసలు రానా జీవితంలో ఏం జరిగి ఉండొచ్చు అన్న ప్రశ్న అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News